• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Aapaata Madhuram 2nd part

Aapaata Madhuram 2nd part By Dr Raja

₹ 500

ఆలీబాబా 40 దొంగలు

1955లో విడుదలైన ఈ చిత్రంలోని పాటల వరకూ తెలుగు ప్రేక్షకుల కోసం వేరేగా చిత్రీకరించారని చెబుతారు. ఇదే పేరుతో ఎన్.టి.ఆర్., జయలలిత కాంబినేషన్తో 1970లో మరొక చిత్రం వచ్చినా - ఈ ఆలీబాబా 40 దొంగలు టైటిల్ని పేరడీ చేస్తూ 'ఆలీబాబా అరడజను దొంగలు' అంటూ ఈ కథతో సంబంధం లేకుండా ఇంకొక చిత్రం వచ్చినా - వీటన్నిటికీ ప్రేరణ మోడరన్ థియేటర్స్ వారు తమిళ (తెలుగు) భాషలో నిర్మించిన 'ఆలీబాబా 40 దొంగలు' చిత్రమేనని చెప్పక తప్పదు. ఎం.జి.ఆర్., భానుమతి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ రంగుల చిత్రానికి సంగీతం సుసర్ల దక్షిణామూర్తి. ఈ చిత్రానికి ముందు 1954లో మహిపాల్, షకీలాతో 'ఆలీబాబా చాలీస్ చోర్' అనే ఓ హిందీ చిత్రం వచ్చింది. ఆ చిత్రానికి యస్.యన్. త్రిపాఠి, చిత్రగుప్త సంగీతాన్నిచ్చారు. వారు స్వరపరిచిన ఆ చిత్రంలోని పాటలలో ఓ అయిదిటిని తెలుగు, తమిళ వెర్షన్లకు తీసుకోవడం జరిగింది. ఆ పాటలతో పాటు స్వరపరిచిన మరో నాలుగు పాటలు కూడా ఆ రోజుల్లో బాగా పాపులర్ అయ్యాయి. వెరసి తొమ్మిది పాటలూ ఇవి.

అందంలో పందెమేస్తా అందర్నీ ఓడిస్తా మందార మకరందాలు అందెల్లో చిందిస్తా మేలైన జాతి రోజా యీ మెరుగే చూడండీ ఎవరైనా చేరవస్తే మెరుగంతా మారునోయ్ ముళ్లన్నీ గుచ్చునోయ్

ఓ... యీలేసి సైగచేసే వేషాలు చాలునోయ్ యీ వింత చేతలన్నీ నా చెంత సాగవోయ్ ఒయ్యారి ఒంపులన్నీ ఒలికించె రాణివోయ్ ఆటంటే మోజులేదా అబలంటే మోజులా.................

  • Title :Aapaata Madhuram 2nd part
  • Author :Dr Raja
  • Publisher :Sresta Keerthi Creations Hyd
  • ISBN :MANIMN6082
  • Binding :Papar Back
  • Published Date :Feb, 2025
  • Number Of Pages :427
  • Language :Telugu
  • Availability :instock