• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Anubhava Vedanta Gitasaramu

Anubhava Vedanta Gitasaramu By Sri Godditi Pullappa

₹ 150

ఉపోద్ఘాతము

నేనీ పుస్తకము రాయడానికి కారణమైన భూమికను తెలియజేయు చున్నాను. నేను 1996 నుండి 2002 వరకు శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ గా పనిచేసియున్నాను. ఆ ఏడు సంవత్సర ములలో నేను ప్రతి ఆదివారము లేక సెలవు దినములలో శ్రీశైల దేవస్థానము సమీపములో ఒంటరిగా జపధ్యానములు చేయుచూ ఆధ్యాత్మిక గ్రంథములు చదువుచూ గడిపేవాడిని. దైవచింతనలో వారానికొకరోజు గడుపుట వలన నేనెంతో ప్రశాంతతను అనుభవించేవాడిని. శ్రీశైల మల్లికార్జునస్వామి కృపవల్లనే 7 సం||లు శ్రీశైలంలో ఉండడం జరిగినది. 2002 నుండి 2006 వరకు అనంతపురము సమీపములోని పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో గల జలవిద్యుత్ కేంద్రములో డివిజనల్ ఇంజనీర్గా పనిచేసి అక్కడే పదవీ విరమణ చేసియున్నాను. పదవీ విరమణ తరువాత ఆధ్యాత్మిక మార్గములో పయనిస్తూ, శ్రీ భగవద్గీతను, ఉపనిషత్తులను, శ్రీ రమణ భగవానులు, ఆదిశంకరులవారు మొదలైన గురువులు ఉపదేశాలను అధ్యయనం చేసినాను. ఈ విధంగా నేను పొందిన జ్ఞానాన్ని ఈ గ్రంథ రూపములో మీకు అందిస్తున్నాను.

శ్రీ మహాభారతములోని భీష్మ పర్వములో శ్రీ కృష్ణభగవానుడు అర్జునునకు ఉపదేశించినదే శ్రీ భగవద్గీత. భారతానికి హృదయము శ్రీ భగవద్గీత. భారత పద్మములోని సుగంధము శ్రీ భగవద్గీత. భగవద్గీత.................................

  • Title :Anubhava Vedanta Gitasaramu
  • Author :Sri Godditi Pullappa
  • Publisher :Vishalandra Publishing House
  • ISBN :MANIMN4331
  • Binding :Papar back
  • Published Date :Feb, 2022
  • Number Of Pages :217
  • Language :Telugu
  • Availability :instock