ప్రభుత్వ ఉద్యోగులు తమ విద్యుక్త ధర్మాలను నిర్వహించు సందర్భలలో తెలుసుకోవలసిన విభిన్న రకములైన చట్టాలు, విభిన్న రకములైన నియమ నిబంధనలు మొదలగు వాటికన్నింటికంటే "రాష్ట్ర స్థాయి ఉద్యోగులు మరియు వారి నియంత్రణలోగల ఉద్యోగుల సేవా నియమావళులు, 1996 అత్యంత ప్రాముఖ్యత వహిస్తాయి. దీనినే మనము సాధారణ నియమావళులు గా కూడా పరిగణిస్తూ వుంటాము. పరిపాలనా సౌలభ్యం కోసం ఖాళీగా వున్న ఉద్యాగాలను భర్తీ చేయుసందర్భంలో అనుసరించవలసియున్న నియమ నిబంధనలు, నేరుగా నియామకాలు, కాంట్రాక్టు పద్దతి పై నియామకాలు మరి కొన్ని విశదీకరించటం జరిగినది.
కార్యాలయపు దైనందిన కార్యకలాపాలతో ఈ పుస్తకం ఉపయుక్తంగా వుంటుందని భావిస్తున్నాము. ఎప్పటిలాగే ఉద్యోగులు తమ విషయ పరిజ్ఞానాన్ని పెoపొందించుకునేందుకు, ఈ పుస్తకాన్ని తప్పక చదువుతారని భావిస్తున్నాము.