Logili Books

Ayurveda

Ayurveda Vaidya Sutralu

By Dr. Badam Ramesh Babu

₹120
Out of Stock
Out of Stock
Book Details
Title
Ayurveda Vaidya Sutralu
Publisher
J.P.Publications
ISBN
JPPUBLT025
Binding
Papar back
Published Date
2018
Number Of Pages
216
Language
Telugu
Availability
Out of Stock
About this book

 ఆయుర్వేదము వేదశాస్త్రాల నుంచి మహర్షుల పరంపరగా మనకు అందిన సశాస్త్రీయమైన వైద్య విధానము. వేల సంవత్సరాల నుంచి భారతీయ వైద్య విధానము ఇప్పటి అన్ని రకాల వైద్య విధానాల కంటే ఉన్నతంగా వుండి ప్రపంచమంతా ఆచరిస్తూ అనుసరిస్తున్న ఆయుర్వేదము మనకు గొప్పవరము లాంటిది. చికిత్సా విధానము అయినా మన సాంప్రదాయాలకు, జీవన విధానాలకు అనుబంధమైన వైద్య విధానము. ఉదాహరణ: శివపూజకు బిల్వపత్రాలు వాడటము, గుడిలో తీర్ధంలో తులసి, కర్పూరము, పసుపు మొదలైన వాడటము, వినాయక చవితికి అనేక మూలికలు వైద్య అవసరాలకు పనికివచ్చే మొక్కలు పత్రిగా వాడటము ఇవన్నీ మన సాంప్రదాయానికి అనుబంధమైనవి.

           మనిషి నిండు జీవితాన్ని ఆరోగ్యవంతంగా ఆనందంగా జీవించటానికి అవసరమైన ఆహార విధానాలు, విహారాలు వ్యాధులు, వాటికి చికిత్సలు అన్ని సూత్రాలను సశాస్త్రీయంగా ఆయుర్వేదములో వివరించారు. 21సెంచరీ, కంప్యూటర్ యుగంగా అభివృద్ధి చెందినా స్వైన్ ఫ్లూ, ఎయిడ్స్, డెంగ్యు మొదలైన వైరస్ జబ్బులు వచ్చినప్పుడు ప్రపంచమంతా కంగారు పడుతుంది. ఆయుర్వేద వైద్య విధానాల జాగ్రత్తలు పాటించటము వలన అంతటి భయానక వ్యాధుల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.

            మనకు వచ్చే సాధారణ వ్యాధులనుంచి భయానక వ్యాధుల వరకు ఆయుర్వేదములో ఎన్నో చికిత్సా పద్ధతులు కలవు. ఆయుర్వేదములో వివరించిన అన్ని మందులు సాధారణంగా మనకు అందుబాటులో వుండే మూలికలు, పచారీ కొట్టలో దొరికేవి, ఇండ్లలో దొరికేవి కాబట్టి ఎన్నో వైద్య సమస్యలకు ఆయుర్వేద సూత్రాలు, మందులు వాడి పరిపూర్ణ జీవితాన్ని ఆరోగ్యంగా గడపటానికి చక్కగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ అమూల్య వైద్య విధానాన్ని ముందు తరాలకు కూడా అందివ్వగలగాలని ఆశిస్తున్నాము.

- బాదం రమేష్ బాబు

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?