కాసుల పేరు
శ్రీ రామచంద్ర ప్రభో.. ఏమోయ్ (నిద్రలేస్తూనే మన ముసలిహీరో శాస్త్రి క పెట్టాడు
లేచారా. ఇదిగో వస్తున్నా కళ్ళుతెరవండి. అయినా ఎదురుగా మనఫొటోవుందిగా. చూసి లేవొచ్చుగా
అని వంటింట్లోనుంచే సమధానం చెప్పింది శాస్త్రిభార్య మనముసలిహీరోయిన్ అమంగళమ్ మాట్లాడకు. ఫొటో చూడ్డమ్ ఏమిటి నీ హెడ్డు
సరే లేవండి. గుమ్మం దగ్గర నుంచున్నా.
ఏమిటి పొద్దున్నే మడికట్టావ్
ఈవేళ వరలక్ష్మీ వ్రతం మర్చిపోయారా
అవునవు
మొహంకడుక్కుని ఫ్లాస్కులో కాఫీ పోసి వుంచా తాగి త్వరగా స్నానంచేసి రండి నువ్వు
పూజ వుందే ఎలా తాగుతాను.
సరే నేను కూడా ఆనక పూజ అయాకే నీతోబాటు తాగుతా. ఇదిగో పావుగంటలో స్నానం చేసి వస్తా
వచ్చారా అదేమిటి తడిలుంగీతోనే వచ్చారు. దేవుడిగదిలో మీపట్టుపంచ ఆరేసి మడతపెట్టి వుంచా. వెళ్ళి కట్టుకురండి
నాక్కూడా ఏమన్నా పనిచెప్పు
చూడంది ఈబేసినులో అన్నం దానిమీద వేయించిన పోపు దానిమీద
మిరపకాయలతో వుడికించిన చింతపండు పులుసు వేసా.
దేనికే యిది
పులిహారకండీ
మరి పులిహార తెల్లగావుందేమిటి
కింద పసుపు వుంది. మీరు ఈమొత్తమ్ బాగా కలియబెట్టందిడి.............