• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Frederic Engels

Frederic Engels By Seetharam Echuri

₹ 25

ప్రపంచపు తొలి మార్క్సిస్టు ఫ్రెడరిక్ ఎంగెల్స్
 

- సీతారాం ఏచూరి

నవంబరు 28, 2020 ఫ్రెడరిక్ ఎంగెల్స్ ద్విశత జయంతి. ఈ కరోనా మహమ్మారి విజృంభణ, దాని పర్యవసానంగా మనం తప్పనిసరిగా పాటించవలసిన జాగ్రత్తలు, లాక్ డౌన్ నిబంధనలు మనకు పరిమితులు విధించాయి గాని లేకుంటే 2018-19 లో మార్క్స్ ద్విశత జయంతిని ఏవిధంగా ఘనంగా నిర్వహించామో, అదే విధంగా ఇప్పుడూ నిర్వహించవలసిన సందర్భం ఇది.

మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథాన్ని ఆవిష్కరించడంలో, దానిని విశదీకరించడంలో ఎంగెల్స్ పాత్ర, సైద్ధాంతిక కృషి అత్యంత ప్రాధాన్యత కలిగివుంది. గతితార్కిక పద్ధతి వ్యక్తమైన తీరును, విశ్వంలో సమస్త భౌతిక పరిణామ క్రమానికి వర్తించే నియమాలనూ, జీవ పరిణామ క్రమాన్నీ, మానవ సమాజ పరిణామ క్రమాన్నీ అవగాహన చేసుకోడానికి, వాటిలోని గతితర్కాన్ని గుర్తించడానికి ఎంగెల్స్ సైద్ధాంతిక కృషి ఎంతగానో తోడ్పడుతుంది. నిజానికి ఎంగెల్స్ రచనలనూ, మానవ మేధ, దార్శనికత, నాగరికత పురోగమనంలో ఎంగెల్స్ పోషించిన సృజనాత్మక పాత్రనూ తిరిగి అధ్యయనం చేయవలసిన తరుణం ఇది. ఏదో ఒక్క వ్యాసంలోనే దీనినంతా వివరించడం అసాధ్యం. ప్రస్తుత పరిమితులెలా ఉన్నా, పార్టీ ఈ అంశాలన్నింటి పైనా రానున్న ఏడాది పొడవునా కార్యక్రమాలను చేపడుతుంది.

నేను ప్రస్తుతం ఒక ప్రధాన అంశాన్ని మాత్రం చర్చిస్తాను. ఆచరణను, సిద్ధాంతాన్ని గతితార్కికంగా మేళవించే ఒక ఆలోచనా విధానంగా మార్క్సిజానికి ఆ పేరు కారల్ మార్క్స్ నుండి వచ్చింది. అయితే ఈ విషయంలో ఎంగెల్స్ నిర్వహించినది అంత ప్రధానమైన పాత్ర కాదనే అభిప్రాయం తరుచుగా వ్యక్తమౌతూ వుంటుంది. ఇది చాలా చాలా పొరపాటు అభిప్రాయం అనే చెప్పాలి. తన రచనలలో పాదార్థిక, సామాజిక జీవితంలోని అన్ని అంశాలలోనూ గతితర్కాన్ని ఆవిష్కరించిన తీరును. చూస్తే ఎంగెల్స్ ఎంత ప్రధానమైన పాత్ర పోషించాడో తెలుస్తుంది. మానవ సమాజం...................

  • Title :Frederic Engels
  • Author :Seetharam Echuri
  • Publisher :Praja Shakthi Book House
  • ISBN :MANIMN5373
  • Binding :Papar Back
  • Published Date :Nov, 2020
  • Number Of Pages :32
  • Language :Telugu
  • Availability :instock