Logili Books

Short Stories

Kunnemma ( Mari Konni Kathalu)

By Balasudhakar

₹175
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Kunnemma ( Mari Konni Kathalu)
Author
Publisher
Chayya Resources center
ISBN
MANIMN6255
Binding
Papar Back
Published Date
April, 2025
Number Of Pages
137
Language
Telugu
Availability
In Stock
About this book

మనిషితనంపై విశ్వాసంతో...

కవిగా ప్రసిద్ధుడైన బాల సుధాకర్ మౌళి యిప్పుడు కథకుడిగా మన ముందుకు వస్తున్నాడు. కవిత్వం కథ ఈ రెండింటికి పోటీ పెట్టి యెక్కువ తక్కువ అంచనా వేయడం తప్పే గాని రెండు సృజనాత్మక వ్యాసంగాల్నీ ఒకే రచయిత నిర్వహిస్తున్నప్పుడు ఆ వ్యక్తికున్న కవిత్వ అభివ్యక్తి కథనం నైపుణ్యం వొకదాన్ని మరొకటి యెలా ప్రభావితం చేసుకుంటాయి అన్న అధ్యయనం ఆసక్తిగొలుపుతుంది, విమర్శలో కొత్త ఆలోచనలకు సంవిధానానికి దారులు వేస్తుంది. కథలో కవిత్వచ్ఛాయలు కథకు వన్నె తెస్తాయి. అలాగే కవిత్వంలో వినిపించే అనుభూతి కథను తాకితే కథ సాంద్రమౌతుంది. ఒక సామాజిక సంఘటనని లేదా ఒక జీవిత అనుభవాన్ని కవిత్వంగా మలచే సందర్భంలో కథన శైలిని ఆశ్రయిస్తే ఆ కవితలో వాస్తవికత పాలు పెరిగే అవకాశం వుంది.

కవిత్వ భాషాభివ్యక్తిలో తార్కికత లేకున్నా ఫర్వాలేదు. పైగా అలా లేకుండటం వొక అలంకారం. కథలో వాక్యం తర్క బద్ధంగా వుండటం అగత్యం. కవిత్వంలో ప్రతీకల వెనకో అలంకారాల వెనకో దాగి వుండే అవకాశం తక్కువ. కథలో పాత్రల వెనక దాగి వున్నా రచయిత కంఠ స్వరం తెలిసిపోతుంది. అలా అన్జెప్పి చేయి తిరిగిన రచయితలు కథలో ప్రతీకాత్మకత అసంబద్ధత వంటి ప్రయోగాలు చేయకుండా వుండరు. రచయిత రెండు ప్రక్రియలూ సాధన చేసినప్పుడు కొత్త ప్రయోగాలకు అవకాశం వుంటుంది. కథలో కవిత్వ పరిమళం కథనాన్ని తప్పకుండా యేదో మేరకు సౌందర్య భరితం చేస్తుంది. ఒక్కోసారి పేరాలు పేరాల్లో వచనంలో చెప్పలేని విషయాన్ని వొక్క కవితాత్మక వాక్యం ద్వారా వ్యక్తీకరించగలగడం చూస్తాం.................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?