• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Mudu Darulu

Mudu Darulu By Devulapalli Amar

₹ 395

రాజకీయాలు....ఒక సమాలోచన

చరిత్రను తిరగదోడటం దేనికి? చరిత్ర పుటలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ వర్తమానంలోకి రాలేమా? రావచ్చు. కానీ గతాన్ని నిశితంగా పరికించినప్పుడు మాత్రమే వర్తమానాన్ని బేరీజు వేయగలం. అంతేకాదు, వర్తమానంలో చోటు చేసుకుంటున్న మార్పులను, జరుగుతున్న సంఘటనలను నిష్పాక్షిక దృష్టితో చూసే వీలు కలుగుతుంది. చరిత్రను అవలోకించడం ద్వారా నిర్మొహమాటంగా, నిర్ద్వంద్వంగా సంఘటనను విశ్లేషించే వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి, చరిత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల రాజకీయ చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. అలా అని చెప్పి, భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని ఇప్పుడు కాచివడబోయాల్సిన అవసరం లేదు. స్వాతంత్ర్యోద్యమంలో తెలుగువారి పాత్ర అమోఘమైనది. దాని రచనకు పూనుకుంటే అదొక ఉద్గ్రంథమే అవుతుంది. కానీ అది ఈ రచయిత పని కాదు.

స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొట్టమొదటగా భాషప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా ఏర్పడటానికి ముందు జరిగిన పరిణామాలు ఇప్పటికీ మన రాజకీయాలను, సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. మన చరిత్రలో ఆనాటి సంఘటనలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ప్రత్యేక తెలుగు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరణను కోరుతూ ఎన్నో సామాజిక, రాజకీయ ఉద్యమాలు జరిగాయి. వాటిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు, కుతంత్రాలు కూడా జరగకపోలేదు. ఎంతోమంది మహానుభావులు తమ ప్రాణాలను....................

  • Title :Mudu Darulu
  • Author :Devulapalli Amar
  • Publisher :Rupa Publications India Pvt Ltd 2024
  • ISBN :MANIMN5122
  • Binding :Papar back
  • Published Date :2024
  • Number Of Pages :206
  • Language :Telugu
  • Availability :instock