విలక్షణ కవయిత్రి ప్రగతి
కవిత్వం కవిని ఆవహించే ఒక ప్రత్యేక సందర్భం. రాయకుండా ఉండలేని స్థితిలో మనోచిత్రాలకు అక్షరపు తొడుగుల్ని తొడుగుతుంది. భావావేశం, భావ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కవిత్వంలో,
ప్రగతి కథా రచయిత్రిగా పరిచయం. తనలోని విషయ మగ్నత కథల్లో కనిపిస్తే, ఒక పరిపాలన దక్షత సభ నిర్వహణలో కనిపించాయి. మంచి స్నేహశీలి, మృదుభాషిణి. తొలిసారే చూసినా అనంతపురంలో ఆత్మీయురాలిగా అనిపించింది. కవిత్వంతో రచన ప్రారంభమైనప్పటికీ తాను చెప్పదలుచుకున్న విషయాలని వివరంగా తెలిపేందుకు కథా ప్రక్రియను ఎన్నుకొందనిపించింది. తన కథాసంపుటి కోయిలచెట్టుకాగా, అనంతపురం జిల్లా మహిళా కథకుల కథలు సేకరించి పుస్తకం వేయడంలో ప్రగతి నిబద్ధతను ఉత్సాహాన్ని గమనించొచ్చు.జి. నిర్మలా రాణి, బి. హేమమాలిని, ప్రగతిల సంపాదకత్వంలో 'ముంగారు మొలకలు' కథాసంకలనం వచ్చింది. ఇదే తొలి మహిళా కథకుల పుస్తకం. 25 మంది రచయితలతో వచ్చిన ఈ సంకలనం ఎంతో విలువైన పుస్తకం.
సాహిత్య ప్రపంచంలో రచననొక బాధ్యతగా, తక్షణ అవసరంగా సీరియస్గా ఆలోచించే గుణం ప్రగతిలో కనిపించింది. కవిత్వాన్ని నాకు పంపి, మీరు రాయాలి. అన్నప్పుడు, కొంచెం ఆలోచించాను. ప్రస్తుతం ఉన్న అనారోగ్య పరిస్థితిలో రాయగలనా అని ప్రశ్నించుకున్నాను. కానీ ప్రగతి కవిత్వంలోకి ప్రవేశించాక నా ప్రమేయం లేకుండా కవిత్వంలోకి వెళ్ళిపోయాను.
డాక్టర్ ప్రగతి వృత్తిరీత్యా రసాయన శాస్త్ర అధ్యాపకురాలిగా పనిచేసి, పదోన్నతిపై హిందూపురం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నది. సాహిత్యంతో తన ప్రయాణం చిన్ననాటి నుంచే మొదలైందని, పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువగా ఉండటం వల్ల చుట్టూ జరిగే సంఘటనలకు స్పందించే గుణం రాయడానికి దోహదపడ్డాయని ఆమె అభిప్రాయం...........................