• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Paruvu
₹ 150

మనలో మన మాట ఆ

ఒక... వ్యక్తిగతం కాదు, సామూహికం.

ఎందుకు ఇదంతా? అంటే, ఏమో. సరైన సమాధానం లేదు. కారణాలున్నాయి. చెల్లాచెదురవుతోన్న కాలాన్ని కుప్పగా పోసుకోడానికి ఇదో మార్గంగా అనిపించిందేమో. ఇష్టమైన వ్యాపకం కనుక, ఇటు రావాలనిపించిందేమో. కానీ, స్పష్టంగానే ఉన్నాం. అనవసరాన్ని వడపోసి, అవసరాన్ని మాత్రమే మీ ముందుకు తెస్తాం. అక్షరదోషాలూ, అన్వయదోషాలూ లేని నిఖార్సైన పుస్తకాన్ని చేతిలో పెడతాం. చీకటి గురించి బెంగ ఉంది కానీ, భయం లేదు. ఈ లోకంలో కాంతి ఉంది, అదే ధైర్యం. కాంతినే ప్రచురిస్తాం.

అది ఏ సామాజిక మాధ్యమమైనా సరే... దానికీ, సమాజానికీ మధ్య సజీవ సంబంధం ఉండాలి. ఆ ఎరుకతో ఉంటాం. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అనడం ఎంత నిజమో, మనిషి పుస్తకం చుట్టూ తిరగాలి అనేది కూడా అంతే అవసరమని నమ్ముతున్నాం. ఈలోకంలో తనదైన చోటు పుస్తకానికి ఎప్పటికీ ఉంటుంది. పుస్తకానికి తనను తాను నిలుపుకోగల శక్తి ఉంది. మంచి పుస్తకాలను తెరిచి, మనం చదువుతూ ఉంటే చాలు. వాటి పని అవి చేసుకుపోతాయి. జాన్రాల పట్టింపేమీ లేదు. అది బతుకులోంచి రాలిన శకలమైతే చాలు. రేషనాలిటీని అద్దుకుని ఉంటే సరిపోతుంది. మేం అచ్చువేసుకుంటాం. అదే ముందుకెళ్తుంది.

ఈ లోకం ఎవరికైతే అన్యాయం చేసిందో, ఈ లోకం ఎవరినైతే మాట్లాడకుండా చేసిందో... వాళ్ళని అచ్చులో ఉంచడమే మా ప్రాధాన్యత. సమానత్వం మాకు ముఖ్యం. ఇవే కాదు, విషాదం తర్వాత, వినోదమూ ఉంటుందని గుర్తుచేస్తాం. హాయిని పాడటమూ మాకిష్టమే. ప్రేమను పలవరించడమూ మాకిష్టమే........................

  • Title :Paruvu
  • Author :Jupinderjit Singh , Jhansi Papudesi
  • Publisher :Oka Publications
  • ISBN :MANIMN6315
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :109
  • Language :Telugu
  • Availability :instock