అనగా "ఆత్మ యందుగాని, శరీరమందుగాని యే వేదవిహితములైన క్రియలు నిర్వర్తించుటచే అతిశయవిశేషము కల్గునో అదియే సంస్కారము" అని దీని కర్దము. ఈ "అతిశయవిశేష మనగా నేమి?" - వాణి నాచరించు వ్యక్తి ధైహికంగాను, మానసికంగాను, బౌద్ధికంగాను, శుద్ధుడై ధర్మనిష్ఠుడగుటయే ఈ అతిశయవిశేషము.