Logili Books

Astrology and Panchangalu

Trikonatantram

By Chintagunta Subbarao

₹60
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Trikonatantram
Publisher
Ravi Mohanarao
ISBN
MANIMN3827
Binding
Papar back
Published Date
April, 2018
Number Of Pages
106
Language
Telugu
Availability
In Stock
About this book

శ్రీః

ప్రథమోధ్యాయః

ఓం

పరమదేవతాయై నమః | శ్రీగురవే నమః |

కైలాశశిఖరారూఢం దేవదేవం జగద్గురుమ్ ||
సదా స్మేరముఖీ దుర్గా పప్రచ్ఛ నగనన్దినీ ॥

ప్రతిపదార్థం : సదా = ఎల్లప్పుడూ, స్మేరముఖీ = చిఱునవ్వు ముఖమునగల, దుర్గా = దుర్గయగు, నగనన్దినీ = హైమావతి, పార్వతి, కైలాశశిఖరారూఢమ్ = కైలాసపర్వతాగ్రాన నెలకొన్న, జగద్గురుమ్ = జగత్తునకు జ్ఞానమునిచ్చు, దేవదేవమ్ = : దేవతారాధ్యుడైన, దేవుడగు శివుని, పప్రచ్ఛ = అడిగెను.

తాత్పర్యం : కైలాసశిఖరవాసియైన జగద్గురుని దేవదేవుని ఎప్పుడూ నగుమోముగల హిమవత్ప్ర్పుత్రి దుర్గ ఈ విధంగా అడిగింది.

శివుడు జ్ఞానదాత కనుక జగద్గురువు. కైలాసశిఖరం వీని నెలవు. శివునితో కలిసియున్న పార్వతి ఆనందమూర్తియే. కనుకే హైమావతిగా హిమవంతునికి ఆనందదాయిని యైనది. నగుమోముతో విరాజిల్లుతూన్నది. భక్తసులభమైనది. ఆమె దుర్గ, చేరరానిది.

=

శ్రీదేవ్యువాచ | : శ్రీదేవీ = మహాదేవుని ఇల్లాలు, ఉవాచ =

ఇట్లన్నది.

చతుఃషష్టి చ తస్త్రాణి కృతాని భవతా ప్రభో! ॥
తేషాం మధ్యే ప్రధానాని వద మే కరుణానిధే! ॥

ప్రతిపదార్థం : ప్రభో! = స్వామీ!, భవతా = తమచేత, చతుఃషష్టి = అరువదినాలుగు, తన్రాణి = తంత్రములు, కృతాని = చేయబడినవి, చ = మఱియు, తేషాం మధ్యే : వానిలో, ప్రధానాని = ముఖ్యమైన వానిని, కరుణానిధే! = దయాసముద్రా!, మే = నాకు వద = చెప్పుము.

=

తాత్పర్యం : స్వామీ! తమరు అరువదినాలుగు తనాలను నిర్మించినారు కదా, వానిలో ముఖ్యమైనవానిని దయతో నాకు చెప్పండి.........

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?