Logili Books

History

Veda Rahasyam

By Sri Arobindo , P V Srinivasa Chakravarthi

₹300
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Veda Rahasyam
Publisher
Peacock Classics
ISBN
MANIMN6730
Binding
Paparback
Published Date
2025
Number Of Pages
258
Language
Telugu
Availability
In Stock
About this book

వైదిక సిద్ధాంతం - సింహావలోకనం

మన మేధోజన్య తత్వచింతనా సాంప్రదాయాల కన్నా పురాతనమైన యుగానికి చెందిన రచన వేదం. ఆ ఆదిమ యుగంలో ఆలోచన మన తార్కికమైన హేతుశక్తి కన్నా భిన్నమైన మార్గాలని అనుసరించింది. భాష మన ఆధునిక ప్రమాణాలు అసమ్మతమని భావించే ధోరణులని అలవరచుకుంది. ఆ యుగంలో విప్రోత్తములు, సామాన్య మానవ దైనిక వ్యవహారాలకి, ఇంద్రియ వృత్తులకి అతీతమైన జ్ఞాన రంగాలలో వ్యవహరిస్తున్నప్పుడు ఎప్పుడూ అంతరిక అనుభూతి మీదను, లోజ్ఞానం ఇచ్చే సూచనల మీదను ఆధారపడేవారు. వారి లక్ష్యం ఆత్మప్రకాశనం; తార్కిక నిరూపణం కాదు. వారి ఆదర్శం అంతఃప్రేరణ గల ఋషి సునిశిత బుద్ధి గల తార్కికుడు కాదు. వేదమూలాలకి సంబంధించిన ఈ సత్యాన్ని భారతీయ సంప్రదాయం భద్రంగా పదిలపరిచింది. ఋషి అంటే ఋక్కులని కూర్చిన ఓ వ్యక్తి కాడు; ఓ సనాతన సత్యాన్ని, వ్యక్తికి అతీతమైన జ్ఞానాన్ని, దర్శించిన ఓ ద్రష్ట. వేద భాషని 'శ్రుతి' అంటారు. ఋక్కులలోని లయ బుద్ధి కూర్చినది కాదు. అది వినిపించినది. వ్యక్తికి అతీతమైన జ్ఞానాన్ని అందుకోవడానికి ఆత్మశిక్షణ చేత సంసిద్ధుడైన మానవుడి అంతశ్రవణానికి వినిపించిన, అనంతుడి లోంచి పెల్లుబికిన, ఓ దివ్య ధ్వని, అసలు దృష్టి (చూపు), శ్రుతి (వినికిడి) అనే పదాలు వైదిక పరిభాషకి చెందినవి. ఈ పదాలే కాక వైదిక పరిభాషకి చెందిన మరెన్నో పదాలు వేద జ్ఞానపు ప్రగాఢమైన, పవిత్రమైన తత్వాన్ని సూచిస్తాయి.

ఆత్మప్రకాశనం అన్న వైదిక భావనలో అదేదో మహిమాన్వితమైనది. లోకోత్తరమైనది అన్న భావన ధ్వనించదు. ఆ సామర్ధ్యాన్ని అలవరచున్న ఋషి క్రమబద్ధమైన ఆత్మశిక్షణ ద్వారా ఆ శక్తిని సాధిస్తాడు. జ్ఞానం అంటే ప్రయాణించడం, అందుకోవడం, కనుక్కోవడం, గెలుచుకోవడం. ఆ మార్గాంతంలో కలిగేదే ఆత్మప్రకాశనం. చరమ విజయానికి బహుమతి అత్మతేజం. ఈ యాత్ర అనే భావన, సత్యం దిశగా జీవాత్మ సలిపే యాత్ర అన్న భావన, వేదంలో మనకి తరచు ఎదురవుతూ ఉంటుంది. ఆ యాత్రలో జీవాత్మ ముందుకి సాగుతూ పైపైకి అధిరోహిస్తుంది. దాని ఆకాంక్ష ఫలితంగా కొత్త చైతన్య, తేజో భూమికలు విప్పారుతాయి. ప్రతాపవంతమైన..............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?