స్వాప్నిక మేఘం.
స్వాప్నిక మేఘం.
ఏవో సుదూరసంగీతస్ఫురణలు.
బరువెక్కుతున్న కాలం.
వంతెన కింది నీళ్ల
మార్మిక పద్యం.
చుట్టుముడతాయి
రాత్రులు అరణ్యాలు గుహలు
నల్లని ఆకాశాలు.
జ్వరం తిరగబెడుతుంది.
జీవించాలని కోరిక.
మంత్రపు పొగ
కలవరపెడుతుంది.
సమ్మోహక ఆదిమచిత్రం.
చీకటీ, దీపమూ
రెండూ అదే........................