డార్క్ ఫాంటసీ నుంచి 50 పర్సంట్ లవ్ దాకా....
'ఫాంటసీ'- అంటే ఊహ! కల!
ఇంకా చెప్పాలంటే ఊహాత్మక స్వప్నం! స్వప్నావిష్కృతమైన ఊహ!
'డార్క్ ఫాంటసీ' అని నా మొదటి పుస్తకానికి పేరు ఎలా చీకటిలో ఉన్నపుడూ వచ్చిందంటే... చీకటిగా ఉన్నపుడూ నిదురలోనూ - రాత్రులలోనూ - తటాలున మెదిలే ఊహలో! కలలో! నా కవితలలో ఎక్కువగా ప్రేమా, జ్ఞాపకాలూ, స్మృతులూ, ఆకాశాలూ, సముద్రాలూ, నక్షత్రాలూ, ఎడారులూ, పిట్టలూ, చేపలూ, ఇసుక రేణువులూ, కెరటాలూ ... ఇంకా ఎన్నో ఉంటాయి! అవన్నీ నా డార్క్ ఫాంటసీలే! పగలు కలలు కనడానికి సమయాభావం! అందుకే ఆ పుస్తకానికి ఆ పేరు!
ఇక ఇప్పుడు
రెండో పుస్తకం '50 పర్సంట్ లవ్'! మనిషి జీవితంలో ప్రేమ ముఖ్యమైన భాగం ఆక్యుపై చేస్తుంది అనడంలో సందేహం లేదు, అయితే అది ఎంత శాతమో మనకి తెలియాలి! సగభాగాన్ని ప్రేమకి ఇవ్వడం ద్వారా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లూ అవుతుంది! కేవలం సగమే ఇవ్వడం ద్వారా మిగతా వాటికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు అవుతుంది.. కదూ!........