• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

5555 Yantralu Mantralu Tantralu

5555 Yantralu Mantralu Tantralu By Sri Kondapalli Venkateswarlu

₹ 450

మంత్రతంత్ర ప్రక్రియలు, యంత్రాలు మరియు తాయత్తులు

సుఖ-దు:ఖాలు, మంచి-చెడు సమయాలు, కీర్తి ప్రతిష్ఠలు అప్రతిష్ఠలు, విజయాలు-పరాజయాలు, ఓటములు, ఋణ-రోగాలు- ఇవన్నీ మన జీవితంలో వచ్చి-పోయే సంఘటనలే! కాలాన్ని బట్టి మానవుడు సుఖ దుఃఖాలను అనుభవించవలసి ఉంటుంది. ఇవన్నీ మన పూర్వజన్మ మరియు ప్రస్తుత జన్మలో చేసిన కర్మఫలాలైనప్పకీ మనం వాటి దుష్ఫలితాలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసమే విశ్వమంతటా మానవులు D. ఈ మంత్ర తంత్ర ప్రక్రియలను ఆచరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా అదృష్టాన్ని పెంచుకోవడానికి, తమ గృహాలను సుఖసంతోషాలతో నింపుకోవడానికి, వ్యాపారాలను లాభాలబాటలో నడిపించటానికి ఎన్నో మంత్ర తంత్ర ప్రక్రియలను ప్రయోగించవచ్చు. ఈ మంత్ర-తంత్ర ప్రక్రియల ద్వారా సంతానం లేనివారికి సంతాన ప్రాప్తి, దరిద్రులకు రాజయోగప్రాప్తి కూడా సంభవించాయి. మంత్ర-తంత్ర ప్రక్రియలు అంత్రాలు, తాయత్తుకు సంబంధించి ప్రత్యేక విధి-విధానాలతో కూడిన విద్య కలదు. ఈ కారణంవల్ల ఈ రంగంలో అనుకున్న ఫలాలను సాధించాలంటే కొన్ని నియమాలను తప్పనిసరిగా (విధిగా పాటించవలసి ఉంటుంది.

మంత్ర-తంత్ర ప్రక్రియల్లో విజయాన్ని సాధించడానికి మార్గాలు :

మంత్ర తంత్ర ప్రక్రియల్లో విజయాన్ని సాధించాలంటే శ్రద్ధ, విశ్వాసం, ప్రయత్నం మరియు నియమ-పాలన ఎంతో అవసరం. వీటి ద్వారా మన కష్టాలను, బాధలను తొలగించుకోవచ్చు. ఎప్పుడైనా, ఏ వ్యక్తి అయినా అంతుచిక్కని దీర్ఘరోగానికి గురైతే, అన్ని రకాల చికిత్సలూ నిష్ప్రయోజనమైతే, అలాంటి పరిస్థితుల్లో ఈ మంత్ర తంత్ర ప్రక్రియలు రామబాణంలా పనిచేసి రోగాన్ని సమూలంగా నాశనం చేస్తాయి.

కొన్ని తంత్రాలు కేవలం కొన్ని వస్తువులను ప్రయోగించటం వలననే ఫలిస్తాయి. కానీ కొన్ని తంత్రప్రయోగాలలో విశేష మంత్రోచ్ఛారణ చేయవలసి ఉంటుంది. తాంత్రిక ప్రక్రియలను ప్రారంభించకముందే ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొనవలసి ఉంటుంది...............

  • Title :5555 Yantralu Mantralu Tantralu
  • Author :Sri Kondapalli Venkateswarlu
  • Publisher :Mohan Publications
  • ISBN :MANIMN4393
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :414
  • Language :Telugu
  • Availability :instock