80/20 ర్యాప్ సాంగ్
మీకు తెలుసా? 80/20తో ర్యాప్ సాంగ్ ఉన్న సంగతి. అది అచ్చు వ్యాట్ మో 'జీ జాక్సన్' తరహాలో సాగుతుంది. పాప్ సాంగ్ మాదిరిగా మూడు నిముషాల పాటు సాగే ఈ పాటను ఆసక్తిగల వారు www. richardkoch.net లో వినవచ్చు. ఆ పాటలో ఉన్న అంశాన్ని అటూ ఇటూ కొన్ని మార్పులు చేసి ఈ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని దిగువ అందచేస్తున్నాను.
రిచర్డ్ కోచ్ ఒక వ్యాపారి, అతను ఒక జీవన సత్యాన్ని కనుగొన్నాడు. అది ఒక బృహత్తర ప్రణాళిక.
దాని గురించి పుస్తకం రాశారు. అది సూపర్ హిట్టయ్యింది.
అది నిశ్చలమైంది. న్యాయబద్ధమైంది.
80/20 దాని పేరు
అది నేర్పే పాఠాలు మీకు ప్రాణశక్తిని అందిస్తాయి.
ప్రశాంతంగా కూర్చుని ఈ గేయాన్ని వినండి.
పూర్తయ్యేలోపు మీ ఆలోచనలకు కొత్త వెలుగొస్తుంది.
80/20 సూత్రం విజయానికి మూలం
80/20 సూత్రం తక్కువతో ఏదో సాధించటం నేర్పే మార్గం
80/20 సూత్రం విజయానికి మూలం..............