• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

88 Vela Samvatsaramula Bharata Charitra

88 Vela Samvatsaramula Bharata Charitra By Ph D Dr Sakamuri Siva Rambabu M Sc

₹ 150

విజ్ఞానం లోంచి చరిత్రలోకి

ప్రొఫెసర్ కుప్పా వేంకటకృష్ణమూర్తి,
I-SERVE సంస్థ పూర్వాధ్యక్షుడు,

విద్యాధికారి, అవధూత దత్తపీఠం, మైసూరు.

సైన్సు అంటే తర్కబద్ధమైన పరిశీలన గదా! అలాంటి పరిశీలన చేసేవారు తమ పరిశీలనకు తర్కబద్ధత లేని అవధులను అంగీకరించవచ్చునా ?

ఈ ప్రశ్నకు ఎవరైనా సరే, "తగదు" అనే సమాధానమే చెపుతారు.

కానీ, మానవజాతి దురదృష్టం వల్ల, ఈ నాటి వైజ్ఞానిక లోకం "ప్రయోగపరిశీలన" (Experimental Sruth) అనే పేరుతో, కంటికి ఎదురుగా కనిపించే సత్యాల పట్ల పుట్టు గ్రుడ్డితనాన్ని వరిస్తోంది.

ఇందుకు నిదర్శనాలు అనేకం, ఎవరూ కాదనలేనిది - మన సైన్సును నిగ్రహించే ప్రక్రియ మన దగ్గర లేకపోవటం. దీనివల్లే గదా. ఈనాడు గ్లోబల్ వార్మింగ్ అనేది వెనుకకు త్రిప్పటానికి వీలులేని పరిస్థితిగా మారిపోయింది?!

మరో ఉదాహరణ - కాలగణనం కోసం మన వైజ్ఞానికులు అంగీకరించే కొలమానాలు ! వీటిలో ప్రతి కొలమానానికీ కొన్ని విలువైన అభ్యంతరాలున్నాయి. ఐనా సరే, కొన్ని మానాలను అంగీకరించేసి, మన సైన్సు బుల్డోజర్ లాగా కాలనిర్ణయాలు చేయిస్తోంది.

సుమారుగా 10 వేల సంవత్సరాల వెనుక భూమి మంచుగడ్డగా వుండేదనీ, దానికి వెనుక అగ్నిగోళం లాగా వుండేదనీ - ఇలాంటి నిర్ణయాలు జరిగిపోతున్నాయి.

ఇప్పటికి దొరికిన సాక్ష్యాధారాలు బట్టి మనం చేసే నిర్ణయాలు అంతిమ నిర్ణయాలేనని పట్టుబట్టటం "సైంటిఫిక్ అప్రోచ్" కాగలదా ?

మన పురాతన మహర్షులకు ఇవాళ మనకు లేని మరి కొన్ని పని ముట్లు అందుబాటులో వుండేవి. వాటిని వినియోగించి ప్రయోగాలు చేయగల నైపుణ్యం వారి దగ్గర పుష్కలంగా వుండేది. దానివల్ల, వారు సృష్టిప్రక్రియకు ఆవర్తనసిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

ఈ సృష్టి మొత్తం ఇప్పటికి ఒక్క సారి మాత్రమే జరిగిందన్న అంధవిశ్వాసంతో ముందుకు సాగటం ఒక పద్ధతి. సృష్టి ప్రక్రియ అనేక మార్లు పునరావర్తన చెందిందని చెప్పే ఆవర్తన సిద్ధాంతం మరో పద్ధతి. వీటిలో ఆవర్తననేది మూఢవిశ్వాసమని తిరస్కరించే ముందు, అలాంటి ఆవర్తనం లేదనే సాక్ష్యం మన దగ్గర లేకపోతే, మనదే మూఢవిశ్వాసం అయి తీరుతుంది !!

ఇలాంటిది జరగకూడదంటే, యావన్మానవచరిత్రలో మనకు లభిస్తున్న అతిపురాతనమైన భారతీయమహర్షివాజ్ఞ్మయాన్ని మనం నిష్పక్షపాతంగా అధ్యయనం చేసితీరాలి. ఆ పని వైజ్ఞానికంగా జరగకపోవటం మన అంధవిశ్వాసాల ఫలితమే కావచ్చునేమో!..............

  • Title :88 Vela Samvatsaramula Bharata Charitra
  • Author :Ph D Dr Sakamuri Siva Rambabu M Sc
  • Publisher :Srimati Madamanchi Arjunadevi MA
  • ISBN :MANIMN4275
  • Binding :Papar back
  • Published Date :April, 2023
  • Number Of Pages :135
  • Language :Telugu
  • Availability :instock