• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

96 A Real Life Love Story

96 A Real Life Love Story By s8

₹ 220

ఒక చిన్నమాట...

ఈ సృష్టంతటిలో అద్భుతమైనదీ, తార్కికంగా ఆలోచించగలిగిందీ, మహాద్భుతాలను సృష్టించగలిగిందీ- గుర్తించగలిగిందీ, అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలిగిందీ,

మనిషి పరిణామక్రమాన్ని అడవి నుండి రోదసీ వరకు తీసుకెళ్ళగలిగిందీ మెదడు ఒక్కటే.

ఓ కిలోంబావంతుండే తెల్లని జిగట పదార్థంలోని న్యూరాన్ లలో పుట్టే ఓ చిన్న స్పార్క్ ఎన్నెన్ని శోధించి సాధించింది! మరి ఇంత గొప్ప మెదడు కూడా మనిషి చావుతో నిర్జీవమైపోతుంది. అది సాధించినవేవీ తనలో తనతో చిన్న పరమాణువంత కూడా పట్టుకెళ్ళకుండా అన్నీ ఇక్కడే వదిలి ఏ ప్రపంచంలోనైతే అణువుతో మొదలై వచ్చిందో తిరిగి అదే ప్రపంచంలో రేణువై కలిసి అంతమైపోతుంది. కానీ,

జ్ఞాపకం...

యాది..

ఎంత చిన్నమాట ఇది. దీని జీవితకాలం ఒక జీవి ప్రాణంతోనే అంతం కాదు కదా! ఆ తర్వాత కూడా తరతరాల్ని కలిపి ఉంచే పాశపుదారంలా ఇది నిలిచి కొనసాగుతూనే ఉంటుంది.

మన జీవిత కాలంలో కొన్ని జ్ఞాపకాల్ని పంచుతాం. ఇంకొన్ని జమచేసుకుంటాం.

చివరికి వెళ్తూ వెళ్తూ ఏ కొందరిలోనో జ్ఞాపకమై మిగిలిపోతాం............................

  • Title :96 A Real Life Love Story
  • Author :s8
  • Publisher :Sushi Publications
  • ISBN :MANIMN6459
  • Binding :Papar back
  • Published Date :2025
  • Number Of Pages :192
  • Language :Telugu
  • Availability :instock