• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

A Chilukuri Rama Uma Maheswara Sharma Kathalu

A Chilukuri Rama Uma Maheswara Sharma Kathalu By Chilukuri Rama Uma Maheswara Sharma

₹ 250

నవీన అనుభవం

పదిహేడవ శతాబ్దిలో ఒకరోజు. అమెరికాలో బోస్టన్ నగరం చెరసాల ఎదురుగా ఉన్న ఒక బయలులో, నేరస్తులను ఉరి తీసే వేదిక ముందు పురజనులంతా గుమిగూడి ఉన్నారు. వేదికపైన ఉన్న యువతి వంక వారంతా అసహ్యంతో చూస్తూ, ఆమెను ఛీత్కరిస్తూ కోపంగా మాట్లాడుకుంటున్నారు. చేతిలో మూణెల్ల పాపని పెట్టుకుని నుంచున్న ఆ అందమైన యువతి ఈ కోలాహలమంతా తనకు పట్టనట్లు స్థిరంగానూ ధైర్యంగానూ నుంచుని ఉంది. ఆమె పేరు హెస్టర్ ప్రిన్. ఆమె వక్షస్థలాన్ని కప్పుతున్న నల్లని బట్టల పైన సింధూరవర్ణంలో మెరిసిపోతున్న 'A' అనే అక్షరం, పెద్దగా, చుట్టూతా బంగారు జరీతో, ప్రత్యేకంగా స్పష్టంగా కనిపిస్తుంది. భర్త ప్రవాసంలో ఉండగా వివాహేతర సంబంధం పెట్టుకుని గర్భవతి అయింది హెస్టర్ ప్రిన్. ఆమెను చెరసాలలో ఉంచి, ఆ పాప తండ్రి ఎవరో చెప్పమని ఎంత బలవంత పెట్టినా ఆమె నోరు విప్పలేదు. వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఆ నగరపు న్యాయాధికారులు ఆమెకు విధించిన శిక్ష ఆమె ఆ వేదికపై అందరికీ కనిపించేటట్లు మూడు గంటల పాటు నుంచోవాలి. తన శేష జీవితమంతా తన వక్షస్థలం మీద ఆ 'A' అనే సింధూర వర్ణపు అక్షరాన్ని ధరించాలి. A అన్న అక్షరం ఆమె adulteress (అడల్డెస్ -జారిణి, స్వైరిణి ) అన్న సంకేతం....................

  • Title :A Chilukuri Rama Uma Maheswara Sharma Kathalu
  • Author :Chilukuri Rama Uma Maheswara Sharma
  • Publisher :Aju Publications
  • ISBN :MANIMN6257
  • Binding :Hard Binding
  • Published Date :2025
  • Number Of Pages :203
  • Language :Telugu
  • Availability :instock