సమానమెప్పుడు?
నా కంటి రెప్పలపైన
గీసానేవో
బతుకు బొమ్మలని
అమ్మకానికే అర్హత కానీ
కొనేవాడికేం తెల్సో పోని
నా చిన్ని లోకంలోన
నింపా
నవ్వుల రంగులని
ఏడు రంగులై పగిలిపోయి
కళ్ళ నీళ్ళలో దాక్కున్నాయి
నా ఎదురు మాటలతో
రాసానేవో
నినాదాలని
అన్నీ ఉన్నవాళ్లకెప్పుడూ
చెవులకెక్కడా బాధ చప్పుడు....................