నా మాట
"నేనెందుకు ద్రోణుడి దగ్గర విలువిద్య నేర్చుకోవాలి? విల్లు, బాణం మాచేతివేళ్ళలోంచి రూపొందాయి. వేటాడి జీవించిన మా పూర్వీకుల నుండే ద్రోణుడు విలువిద్యనేర్చుకొని వెళ్ళివుండవొచ్చు...." అని ఏకలవ్యుడు ప్రశ్నిస్తే! జవాబు దాట వెయ్యలేం.
రేణుక జమదగ్ని భార్య, ఆమె తలని నరకమని కుమారుడికే చెబుతాడు జమదగ్ని. రేణుక కేవలం మట్టితోనే కడవ చేసి అందులో నీటిని తెచ్చే వరం | కలది. ఓ రోజు ఎప్పటిలాగే ఏటికెళ్లింది. అప్పుడు అనాలోచితంగా ఆకాశంలో తిరిగే గంధర్వుణ్ణి చూసింది. అంతే ఆమె పాతివ్రత్యం పోయింది. వరం కూడా పోయింది. మట్టితో కడవ చెయ్యలేకపోయింది. ఆమె చేసిన పాపం గంధర్వుణ్ణి చూడటం. అదీ అనాలోచితంగా. అందుకే పాతివ్రత్యం నశించింది. వరం పోయింది. భర్త ఆగ్రహానికి గురైంది.
"కేవలం మట్టితో కడవ చెయ్యటం నాకు ప్రసాదించబడ్డ వరం కాదు. నాకు తగిలించ బడ్డ సంకెళ్ళు" అని ఆక్రోషిస్తుంది రేణుక.
రేణుక ఆక్రోషం తాలూకూ వాస్తవాన్ని మూర్ఖంగా కొట్టి పారెయ్యలేం.
తల్లి తలను నరికి ఎదుట నిలబడ్డ తన కుమారుడైన పరుశురాముణ్ణి గర్వంగా చూశాడు జమదగ్ని. తల్లిని మళ్ళీ బతికించుకునే వరమిచ్చాడు........................