'ఆకాశం నా వశం'
అనువాదం • నా అనుభవాలు
ప్రపంచన్ గారి 'వానం వసప్పడుం' అన్న నవలను (సాహిత్య అకాడెమీ అవార్డ్ - 1995) ముందే చదివి ఉన్నా, అనువాదం కోసం చదువుతున్నప్పుడు సరికొత్త కోణంలో కనబడసాగింది. దాదాపు మూడు శతాబ్దాలకు ముందు ఫ్రెంచ్ వారి పాలనలో ఉన్న పుదుచ్చేరి (పాండిచ్చేరి), అక్కడి ప్రజల జీవనశైలి, సంప్రదాయాలు, సంస్కృతి మన కళ్ళ ముందు కదలాడతాయి. ముఖ్యంగా వేదపురీశ్వరుడి కోవెల కూలగొట్ట బడినప్పుడు అక్కడి ప్రజలు ఎంతగా తల్లడిల్లి పోయారో, నవల చదువుతున్నప్పుడు ఊహించుకోగలము.
పుదుచ్చేరి (పాండిచ్చేరి) సముద్ర తీర ప్రాంతం, తమిళనాడు మాదిరిగానే ఉంటుంది. అక్కడి జనజీవన సంస్కృతిలో ఇప్పటికీ ఫ్రెంచ్ సాంస్కృతిక వాతావరణం కలగలసి కనపడుతుంది.
ఈ నవలను తెలుగులో అనువాదం చేయడానికి అవకాశం లభించి నప్పుడు, క్షేత్ర అధ్యయనం (field work) కోసం నేను తెలుగు వారు నివసిస్తున్న యానాం ప్రాంతానికి వెళ్లాను. ఎందుకంటే యానాం కూడా పుదుచ్చేరి లాగా ఫ్రెంచ్ పాలనలో ఉన్న, కేంద్ర పాలిత ప్రాంతం. ప్రముఖ రచయిత దాట్ల దేవదానం రాజుగారు
'యానాం కవితోత్సవం - 2016' కు రమ్మని ఆహ్వానించారు. వారికి కృతజ్ఞతలు. యానాంలో ఇప్పటికీ ఫ్రెంచ్ వారి ఆనవాళ్ళు ఉన్నాయి. అక్కడి చర్చికి వెళ్లి, తెలుగులో బైబిల్ కొనుక్కున్నాను. బైబిల్ గురించిన ప్రస్తావన ఈ నవలలో కొన్ని చోట్ల ఉంటుంది. బైబిలును చదవడం నాకు మరింత తోడ్పాటుగా ఉండింది.
రచయిత ప్రపంచన్ గారిని ఈ నవలలో నాకు కొన్ని పదాలకు అర్ధం మరింత విశదీకరించి చెప్పమని వేడుకున్నప్పుడు, వారు స్వయంగా మా యింటికి వచ్చి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలవరకూ ఉండి, నా.................