నిష్కృతి
వెంకటాద్రి ఎక్స్ప్రెస్ స్లీపర్ క్లాస్లో తిరుపతి దాకా ప్రయాణం చెయ్యడానికి టికెట్ ఉన్నా తెల్లారుజామున కడపలో దిగేశాడు సాత్యకి.
స్టేషన్ నుండి బయటకొచ్చి, నెమ్మదిగా కాలి నడకన కడప బస్టాండ్ చేరి వేడిగా కప్పు టీ త్రాగాడు. పెద్దగా జనం లేరు బస్టాండ్లో. సీలింగ్ నుండి వేలాడుతున్న డిజిటల్ గడియారం 5.05 అని టైమ్ చూపిస్తూంది. ప్రొద్దుటూరు, బెంగుళూరు, తిరుపతి, అనంతపురం, బద్వేలు... ఏవేవో ఊళ్లకు బస్సులు కనిపించాయి. ఖాళీగా ఉండే బద్వేల్ బస్సు ఎక్కి చివర టూ సీటర్లో కిటికీ పక్కన కూచున్నాడు. మెల్లగా ఒక్కొక్కరే ఎక్కి సగం బస్సు నిండింది. గడియారం 5.45 చూపిస్తుండగా బస్సు కదిలింది. కోటి రెడ్డి సర్కిల్, పాత బస్టాండు, ఏడు రోడ్లు, రమేష్, థియేటర్లను దాటుకుని బస్సు ఊరి పొలిమేరలకు మళ్లింది.,.............