తిరుగుబాటుదారులు, నటులు,
సిపాయిలు, గూఢచారులు
హౌసాబాయి శౌర్య ప్రతాపాలు
వారు మా పొలాన్ని స్వాధీనం చేసుకొన్నప్పుడు నాకు నాలుగు ఏళ్లు కూడా లేవు. మా పిన్ని వయస్సు అప్పుడు తొమ్మిదేళ్లు. ఆ చిన్న వయస్సులో మేము ఎంత పని చేయగలం. పెద్దవారిలా పని చేయలేక పోయాం. మేము కొద్ది సేపు పని చేస్తూ మరి కొద్ది సేపు నీడలో సేద తీరేవాళ్లం.
హౌసాబాయి పాటిల్ విటా,
సాంగ్లీ, మహారాష్ట్ర
తాను తన భార్యను ఒక పోలీసు స్టేషన్ ముందే బాదుతున్నానన్న ధ్యాసే అతనికి లేదు. హౌసాబాయి భర్త పాటిల్ పూటుగా తాగేసి ఆమెను నిర్దాక్షిణ్యంగా కొడ్తున్నాడు. “ఆ దెబ్బల వల్ల నా వీపు విపరీతంగా నొప్పి పుట్టేది” అని ఆనాటి సంఘటనను నెమరేసుకొంటూ చెప్పారు ఆమె. ఆ ఘటన సాంగ్లీకి సమీపంలోని భవానీ నగర్ పోలీస్ స్టేషన్ ముందు జరిగింది. ఆ సమయంలో పోలీస్ స్టేషన్లో ఇద్దరే పోలీసులున్నారు. మిగతా ఇద్దరు మధ్యాహ్న భోజనానికి వెళ్లారు. అంతలోనే భర్త పిడి గుద్దులు మాని భార్యను చంపేస్తానంటూ పెద్ద బండ రాయిని ఎత్తుకొన్నాడు. “ఇక్కడే నిన్ను ఈ రాయితో చంపేస్తాను" అని గర్జించాడు............