దరిదాపు ఏడెనిమిది నెలలుగా జబీన్ కవిత్వం నావద్దే వుంది. మనసు కుదిరినపుడల్లా చదువుతూనే వున్నా; ముఖ్యంగా ఒక నెలనుంచి పాఠ్యగ్రంధంలా చదివాను. కవిత్వ విషయంలో నేను 'Slow Reader'. ముందుకు జరగదు. ఒక కవిత చదవటం, నెమరువేయటం. ఒక కవిత దాకా ఎందుకు, ఒక కవిత్వ చరణం చాలదా? సరిపోతుంది.
“మరణం అంచున నిలబడి
పరిపూర్ణ జీవితంకోసం చేసిన ఆక్రందన
సరిహద్దుల సాక్షిగా సమసి పోయింది
ఒక కరచాలనం, రెండు చేతులుగా
విడిపోయే బాధామయ దృశ్యం
ఏ రెండు దేశాలకూ అర్థంకాదు ”
తన కవిత్వం పుస్తకంగా రాకపోయినా పత్రికల్లో అచ్చయిన కవితల ద్వారా జబీన్ ప్రసిద్ధురాలే. ముఖ్యంగా 'ఆకురాలు కాలం' ఆమెకు మంచిపేరు తెచ్చిపెట్టింది. ఒక వినూత్న స్వరం కవిత్వ పాఠకలోకానికి పరిచయమయింది..............