"ఓయబ్బో మరీ గంతనా! ఐత్తులాల బంగారు మేడికెల్లి దెత్తు! రొండు తులాలన్నవా ఏదోకాడికెల్లి దెచ్చి వెడ. గీ ఒక లగ్గంతోనే అయితదా! ఇద్దరున్నారు. బుడ్డపోరి, బుడ్డపోరడు. ఆల్లగ్గిట్టా పూరాగ లగ్గాలు జేసేతల్కి మా పేణాలుంటవా! ఏ మంటవొదినా నిజవంటవా కాదంటవా!" ఆశ అతిశయం రాజవ్వ గొంతులో.
"నిన్నుకోరి మరి సవందమయితె శాన మంచిగుండదంటన్నావ్, దీన్ని మంచిగుండేటిది కాల్లకాడికొస్తదా మల్ల?” అడిగింది బాలవ్వ "నిజెననుకోరి. గంద్కె గిట్ట సోంచాయించుడు బాలొదినె; పొలం పుట్ర బాగ మంచిగున్నోల్లంట. పిలగాని అబ్బ అవ్వలు నల్గురు కొడుకుల్తో గల్చి ఒక్కకుండల్నె ఒంటరంట" అంది రాజవ్వ
"ఇగ మల్ల సోంచాయించుడేల గువంటిండ్ల బడితె, శానమంచిగ బతుకుతది తియ్ మనపోరి" - - బాలవ్వ
"ఔ ఔనొదినే నా బిడ్డకి, నా అల్లునికి సుత గీ సవందం శాన మంచిగనిపిస్తం. జారిపాకండ గట్టిగ పట్టలంటుండ్రు. పిల్లగాడయితె నాల్గు సమత్సరాలుసంది కంపినిల కొలువు జేస్తుండంట; నెలకి నాలుగొందలు కమాయిస్తున్నడంట. గంద్కె మల్ల బాలవ్వొదినె గీ గుంజులాట! వశమైన కాడ్కి జూత్తం, గట్ల గాకుంటే చేసెడివేముంటది మల్ల.'
"గంతె తియ్ రాజవ్వ. అయితే గని సవందం ఖాయం జేస్కనీకి కోసిస్ జేస్కొని, జల్ది లగ్గం బెట్టుకోండ్రి!"
రాజవ్వ - ఆమె దోస్తు బాలవ్వ మధ్య నడచిన ముచ్చట యిప్పటికిక తీరింది.
శ్యామల సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన అర్బన్ డెవలప్మెంట్ కార్యాలయంలో బాధ్యత గల కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తోంది. అప్పటిదాకా కోస్తా జిల్లాల గ్రామీణప్రాంతాల్లో పనిచేసి 1981లో డిప్యుటేషన్ మీద నగరం చేరుకొన్న శ్యామల నగరం చేరీ చేరగానే...............