• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Aaradugula Nela

Aaradugula Nela By Muddasani Ram Reddy

₹ 100

                                       బిహార్ షరీఫ్ కు పశ్చిమాన పదహారు మైళ్ళ దూరంలో నాలుగు రోడ్డుల కూడలివుంది. కూడలికి వుత్తరాన బండ్ల బాటపై నాలుగు మైళ్ళు కాలినడకన వెళ్ళితె బయ్యన్ అనబడే ప్రసిద్ధి చందిన గ్రామం చేరు కుంటారు. ఆ గ్రామంలో పురుషులు లేరని అనలేము కాని అక్కడొక పుణ్యపురుషుడు జన్మించాడు. ఆయన మన కథా నాయకుడు - షేక్ ఆలా హుసేన్. ఆయన జన్మతో ఆ గ్రామం పేరు శాశ్వతంగా చరిత్ర పుటల్లో నిలిచి పోయింది. షేక్ సాహేబు తన నూనూగు మీసాల నూత్న యౌవనావిర్భావం నుండే రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటుండే వాడు. ఆరోజుల్లో ఖిలాఫత్ ఉద్యమం భారత దేశంలో ముమ్మరంగా సాగుతుండేది. ఆ వుద్యమం మహమ్మదీయుల ఖలీపాలకు సంబంధించిన వ్యవహారం. కాని ప్రమఖ హైందవ నాయకుల తోడ్పాటు తో అది జాతీయోద్యమంగా మారిపోయింది. దక్షిణ ఆఫ్రికానుండి భారత దేశానికి తిరిగి వచ్చిన గాంధీ మహాత్ముడు దాస్య శృంఖలా బద్ధమైన మాతృ దేశాన్ని, శృంఖలా విముక్తం చేయ సంకల్పించిన కారణాన, ముస్లిముల సానుభూతిని అభిలషించి, ఖిలాఫత్ ఉద్యమానికి సహాయ సహకారాలనందించాడు. దశాబ్దాల ఆంగ్లేయుల పాశవిక పాలనతో నిస్తేజమైన భారత జాతి ఖిలాపత్. ఉద్యమ స్ఫూర్తిలో నూతనోత్తేజాన్ని పుంజుకున్నది. సామ్రాజ్యవాద నిషాలో తూలుతున్న తెల్ల దొరల ముఖాల్లో నీలి ఛాయలా వరించాయి. ఖిలాఫత్ ఉద్యమంలో మౌలానా షేక్ లీ, మౌలానా మహమ్మదలీ, గాంధీజీ, ఆనిబిసెంట్ లాంటి నాయకులు పాల్గొన్నారు.

          ఆనాడు ఖిలాఫత్ ఉద్యమం గ్రామాల్లో కూడ విస్తరించింది. బయ్యన్ దాని పరిసర గ్రామాల్లో గల గ్రామాణుల నోట ఈపాట నీనదించేది:

               ఖిలీ పాల కొరకే ఖిలాపత్తు పోరాటం
               కలేజాలున్నవారు కదలి చేయుడార్భాటం

  • Title :Aaradugula Nela
  • Author :Muddasani Ram Reddy
  • Publisher :Sahitya Akademy
  • ISBN :MANIMN2519
  • Binding :Paerback
  • Published Date :2021
  • Number Of Pages :249
  • Language :Telugu
  • Availability :instock