• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Aarella Prema

Aarella Prema By Keerthi Inugurthi

₹ 170

అసలిద్దరిలో ఫ్రెండ్ రిక్వెస్ట్ ఎవరం పెట్టామో తెలీదు కానీ చాలా రోజుల నుంచీ ఫ్రెండ్స్ ఉంటున్నాం ఫేస్బుక్ లో, నేను రాసిన ఏదో కవితకి కామెంట్ పెట్టేంతవరకూ తెలీదు అంతమందిలో అతనొకడు ఉన్నాడని. అప్పటినుంచీ నేను ఏం రాసినా, ఆయన రియాక్ట్ అయ్యాడా లేదా, కామెంట్ పెట్టాడా లేదా అని వెతికేదాన్ని. ఆయన చూడటం కోసమైనా రోజూ ఏదో ఒకటి రాసి పోస్ట్ చేసేదాన్ని, ఆయన కామెంట్కి మాత్రం రిప్లై ఇచ్చేదాన్ని కాదు. ఒక్కోసారి అతన్ని ఉద్దేశించే రాసేదాన్ని. అయినా నేను రాసేవి ఆయన కోసమేనని ఆయనకెలా తెలుస్తుంది? నా పిచ్చి కాకపోతే, ఆయన ప్రొఫైల్ రోజూ చెక్ చేసి కొత్త ఫోటోలేమైనా కనిపిస్తే డౌన్లోడ్ చేసుకునేదాన్ని. వాటిని చూసుకుంటూ మురిసిపోయేదాన్ని. రెండేళ్ళ నుంచీ ఇదే కథ.

అతనంటే ఇష్టమని ఎప్పుడూ చెప్పే ధైర్యం చేయలేదు. అతనికి గానీ, అతని గురించి ఇంకెవరికి గానీ చెప్పే ప్రయత్నం చేయలేదు. ఫేస్ బుక్ లో చూసి లవ్ చేస్తున్నా అంటే ఏమైనా అనుకుంటారని. అతని నెంబర్ కూడా నా దగ్గర ఉంది. ఒక్కోసారి చెప్పాలి అనిపించేది. ఒకవేళ అతనికి లవర్ ఉంటే? అమ్మో.. చెప్పకుండా ఉంటేనే నయం అని ఆగేదాన్ని.

నాకు బాగా గుర్తు ఆ రోజు మార్చ్ 24. ఫస్ట్ మెసేజ్ చేసిన రోజు, ఫస్ట్ కలిసిన రోజు గుర్తు పెట్టుకోవడం పనీపాటాలొదిలేసి ప్రేమించే వాళ్ళకి ఉండే అలవాట్లు లాంటివి. అట్లనే ఇది కూడా. ఫేస్బుక్ ఓపెన్ చేసి చూస్తున్నా.................

  • Title :Aarella Prema
  • Author :Keerthi Inugurthi
  • Publisher :Jhansi Publishers Hyd
  • ISBN :MANIMN6359
  • Binding :Papar Back
  • Published Date :2025
  • Number Of Pages :127
  • Language :Telugu
  • Availability :instock