అట్ట మీది బొమ్మను చూశారా?
ఆ దృశ్యం మనోహరం... కదూ?!
అది మనోహరమని అన్నందుకు ఇటీవల నేను చాల తిట్లు తిన్నాను. ఆ తిట్లు అన్యాయమని ఇలా ఒక చిన్ని కరపత్రమై చెప్పదలిచాను. ముద్దు ముచ్చట ఒక్కటే కాదు. ఒక రాజకీయాంశం కోసం 'పిడివాదం' దెబ్బలు కూడా తిన్నాను. దానికి కూడా ఇదే జవాబు.
వివాదం వివాదం కోసం కాదు.
మరి?
అది యుక్రేన్ రంగభూమిపై 'నాటో' ఓటమి కావొచ్చు. తెలుగునాట రామోజీ రాజగురుత్వ పతనం కావొచ్చు. ఒక యుగం గతించింది. మరో యుగం అవతరిస్తున్న కీలక సమయంలో మనం జీవిస్తున్నాం. ఆధునిక జీవితానికి సంబంధించి ఇది ఒక యుగసంధ్య. చాల విలువలు, అంచనాలు పునర్మూల్యాంకనం కోరుతున్నాయి. నా మట్టుకు నేను నా భావాల్ని... ధైర్యం చేసి, తెగించి చెప్పాల్సి ఉన్న భావాలను కూడా... చిరకాలంగా... ఏ 1980 నుంచో చెబుతూనే ఉన్నాను... వ్యాసాల్లోనూ, ఫేస్ బుక్ లోనూ.
ఆ భావాలను నాలో నేను పదేపదే పరీక్షించుకున్నాను. ఈ భావాలు సరైనవి. చాల అవసరమైనవి. ఈ కీలక సమయంలో మరీనూ. పాత బూజును ఎంత త్వరగా వొదిలించుకుంటే అంత ఆరోగ్యం. ఈ అవగాహనే ఇటీవలి నా వివాదాలకు పునాది. దీనికి... రంగనాయకమ్మతో వివాదం ఒక వేదికగా, ఒక ఉదాహరణగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అందుకే ఈ చిన్న పుస్తకం................