• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Categories
Browse categories

Phone : 9550146514

Aasha Soudhaalu

Aasha Soudhaalu By Kundala Sudarshan

₹ 150

పెద్ద కథలు

బర్హుడే
 

ఉగాది వెళ్ళి ఇంకా వారం రోజులన్నా కాలేదు. అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం ఏడుగంటలకే సూర్యుడు చిటపటలాడేస్తున్నాడు. రోజు రోజుకి దాహం ఎక్కువౌతుంది. ఈ ఎండలకు తట్టుకోవడం కష్టంగానే ఉంది అనుకొంటూ హాల్లో ఫ్యాన్ క్రింద పడక కుర్చీ వేసుకొని పేపరు తిరగేస్తున్నాడు రామారావు.

ఇంతలో ఇంటి ముందు ఓ కారు ఆగిన శబ్దం. అందులో నుండి ఓ వ్యక్తి చిన్న హ్యాండ్ బ్యాగు పట్టుకొని దిగి లోపలికి ప్రవేశిస్తున్నాడు. ఎవరబ్బా ! అని ఆశ్చర్యంగా చూసిన రామారావు, కాస్తా తేరుకొని...

'హాయ్ ! హల్లో అన్నయ్యగారు మీరా ! అంతా బాగున్నారా హైదరాబాద్ నుండి ఎప్పుడొచ్చారు. మీ అమ్మాయిలు, అల్లుళ్ళు మనుమడు మనుమరాలు అంతా ఓకేనా ! రండి కూర్చోండి' అంటూ చేయి అందించి ఆలింగనం చేసుకొని అనురాగంతో లోపలికి ఆహ్వానించాడు రామారావు.

B 'ఆ అంతా బాగున్నామండీ. మీరంతా ఓకేనా ! మీ పిల్లలు సింధూ, శ్రీరాము 5 బాగున్నారా ! అన్నట్టు ఇప్పుడేం చేస్తున్నారు' అంటూ కుర్చీలో కూర్చున్నారు శ్రీనివాసరావు.1

'అమ్మాయి సింధూ బి.టెక్. పూర్తి చేసిందండీ. మొన్నీ మధ్యనే పెళ్ళి కూడా చేశాను. పెళ్ళికి మీరు రానట్టుంది. ప్రస్తుతం జాబ్కోసం అన్వేషణ. ఇక శ్రీరాం యం.యస్సీ. 13 కెమిస్ట్రీ ఫైనలియర్లో ఉన్నాడు' అంటూ ముక్తసరిగా ముగించాడు రామారావు.

'మీ అమ్మాయి పెళ్ళికి వద్దామనుకొన్నాను. కాని నేనప్పుడు స్టేట్సులో ఉన్నాము లేండి. అయినా నా వంతు కట్నం పంపించానండీ ! ఏమిటి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది మాధవి లేదా !' అన్నాడు శ్రీనివాసరావు.

'ఎందుకు లేదు ఉంది వంటింట్లో ఏదో పనిచేస్తూ ఉంటుంది. పిలుస్తానుండండి' అంటూ 'ఏమోయ్ ! ఆ వంటిల్లు కాస్త వదలి ఇలారా ! ఎవరొచ్చారో చూడు' అంటూ కేకేశాడు రామారావు.

'అబ్బా ! ఆ... ! వస్తున్నానండీ' అంటూ చీరకాస్త సవరించుకొని, కొంగుతో చేతులు తుడుచుకొంటూ హాల్లో కొచ్చింది మాధవి..................

  • Title :Aasha Soudhaalu
  • Author :Kundala Sudarshan
  • Publisher :Nava Chetan Publishing House
  • ISBN :MANIMN4560
  • Binding :Papar back
  • Published Date :July, 2018
  • Number Of Pages :152
  • Language :Telugu
  • Availability :instock