ఆయుర్దాయ నిర్ణయమ్
ఆయుర్దాయము లేనిదే జీవన మనుగడ సాగదు
ఆయుర్దాయమును మూడు విధాలుగా నిర్ణయించారు
ఒక వ్యక్తి యొక్క ఆయుర్దాయము నిర్ణయించుటమన్నది పెద్ద సమస్య కాదు. అనగా ఒకరి ఆయుర్దాయమును నిర్ణయించుటకు సరియగు జన్మ సమయం ననుసరించి జాతకచక్రము ఉండి ఉండాలి.
తదుపరి జాతకచక్రమును పరిశీలించే సమయానికి జరుగుచున్న దశ సంవత్సర ఆధారముతో నిర్ణయించవచ్చు. అయితే ఆ జాతకచక్రం కె.యస్. కృష్ణమూర్తి గారు కనుగొన్న ఆధునిక నక్షత్ర జ్యోతిష్య శాస్త్రమునకు చెందినదై ఉండాలి.
ప్రధానముగా జ్యోతిష్యశాస్త్రములోపల మార్పు కనుగొని వాటి ఆధారముతో ఒకరియొక్క ఆయుర్దాయాన్ని కచ్చితంగా చెప్పగలిగినవారు కీర్తిశేషులు ప్రొఫెసర్ కె.యస్. కృష్ణమూర్తి గారు.
ఒకవేళ ఎవరికైన వారి, వాని జన్మ సమయముగాని, జన్మస్థానముగాని తారీఖుగాని లేని యెడల ఆ పరిస్థితులలో ఏ ఒక్కరికి ఏ విధమైన సమాచారములను శాస్త్రము ద్వారా తెలియజేయలేము.
అనగా ప్రశ్నకుని యొక్క ఆయుర్దాయము కావచ్చు లేదా మరేదైనా కావచ్చు. ఈ పరిస్థితులలో కృష్ణమూర్తి గారు కనుగొన్న ప్రశ్నాశాస్త్రము యొక్క ఆధారములో ప్రశ్న ఏదైనప్పటికి తగిన సమాచారము తెలియజేయవచ్చు. అందుకుగాను నిరయణ..............