భూదేవి స్నానం
నా జనం ప్రశ్నిస్తోంది
రాళ్లు, రప్పలూ
గుండెల నిప్పులూ వర్షిస్తోంది.
యవ్వనం తూటాలను పరిహసిస్తోంది
అహో
అదేమిటి?
మురిక్కాల్వలో కాగితాల ఏడుపు
ప్రశ్న పాత్రల్లాల్లో
ప్రశ్నలకు జవాబులు ప్రశ్నలే
తనలో తాను
ఉడికుడికిపోయింది
అగ్నిపర్వతం
ఎన్నాళ్లు?
బ్రద్దలయిపోయింది
ఎగిసింది అగ్ని
ఇక మిగిలిందొక్కటే
ఆఖరు కోర
పోలీసులు
....................