• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Abhinavaguptudu

Abhinavaguptudu By Dhulipala Ramakrishna

₹ 160

          అభినవగుప్తుడు (క్రీ.శ. 940-1015) భారతీయ ప్రదర్శనారంగం, సాహిత్య విమర్శ, సౌందర్య స్వరూపంల నిరూపణలో ప్రామాణికుడు. కాశ్మీర శైవంలోని ప్రత్యభిజ్ఞా సంప్రదాయానికి చెందినవాడు. రససూత్ర వ్యాఖ్యలో అతడు ఆనందవర్ధనుడు స్థాపించిన ధ్వని సిద్ధాంతాన్ని, భట్టనాయకుడి సాధారణీకరణాన్ని అంగీకరించి అనుసరించాడు. 

          నాట్యశాస్త్రం, ధ్వన్యాలోకాలకు అభినవగుప్తుడు రచించిన వ్యాఖ్యానాల ఆధారంగానే వాటిలో ప్రతిపాదించబడిన సిద్ధాంతాలపై మనకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. ప్రవాహశీలమై శోభిల్లుతున్న అతడి శైలి స్వతంత్రమైన సాహిత్యం యొక్క స్థానాన్ని సంపాదించుకొంది.

            ధూళిపాళ రామకృష్ణ (జననం 1964) ఈ గ్రంథాన్ని తెలుగులో అనువదించారు. విజయవాడ, మారిస్ స్టెల్లా కళాశాలలో సంస్కృత విభాగాధ్యక్షులు. 'శ్రీమద్భాగవతే అద్వైత మత ప్రతిష్ఠా', 'అ స్టడీ ఆఫ్ సాంగ్జిట్ ఇన్ స్క్రిప్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్' అను గ్రంథాలను రచించిన డా|| రామకృష్ణ - అప్పయ్య దీక్షితుల శివకర్ణామృతమ్, శివ మహిమకలికాస్తుతిఃలను; నారాయణ తీర్థుల శ్రీకృష్ణలీలా తరంగిణీ, భక్తి చంద్రికలను తెలుగులోకి అనువదించారు. ఆచార్య సత్యవ్రత శాస్త్రి రచించిన శ్రీరామకీర్తి మహాకావ్యమ్ ను తెలుగులోకి అనువదించినందుకు థాయ్లాండ్ మహారాజకుమారి మహాచక్రి సిరింధోమ్ చే బ్యాంకాక్ లో సత్కరింపబడ్డారు.

 

  • Title :Abhinavaguptudu
  • Author :Dhulipala Ramakrishna
  • Publisher :Sahitya Akademy
  • ISBN :MANIMN2522
  • Binding :Paerback
  • Published Date :2018
  • Number Of Pages :208
  • Language :Telugu
  • Availability :instock