వడ్డీకాసుల వాడిని వెనక్కి నెట్టిన అనంత పద్మనాభుడు."
"ఆరవగదిలో ఏముంది? అది తెరిస్తే ప్రళయమా?"
"అసలు నాగబంధం అంటే ఏమిటి?"
"సుప్రీమ్ కోర్టు ఆ ఆరవగదిని తెరవడానికి అనుమతిస్తుందా?"
"టి.పి. సుందర రాజన్ మరణంపై గల కారణాలేమిటి?"
"చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. చూస్తూనే ఉండండి, నిరంతర సమాచార స్రవంతి మీ టివీ 0 - మా రాతే మీ తలరాత"
టక్కున ఛానెల్ మారింది.
అప్పుడే అన్నం తినడానికాని కూర్చున్న అభి"ఛానెల్ మార్చకండి నాన్న" అన్నాడు.
ఎప్పుడూ వార్తలు అంటే చిరాకు పడే అభి వార్తలు పెట్టమనగానే తండ్రి ఆశ్చర్యంగా చూసాడు.
అభి పూర్తి పేరు అభిమన్యు, సొంత ఊరు కడప. అమ్మానాన్నలకు ఒక్కడే సంతానం................