ఆదర్శనీయుడు
మా మంచి ఉపాధ్యాయుడు. ఆచరణ ద్వారా మాకు ఎంతో నేర్పించిన మాస్టారు ప్రథమ వర్థంతికే ఆయన జ్ఞాపకాలతో చిన్ని పుస్తకం ప్రచురించాల్సి వుంది. అనకాపల్లిలో ఆయన ఉద్యమ సహచరులు వెంటనే ఆయనతో వున్న అనుబంధాన్ని తెలియజేస్తూ వాళ్లకు తెలిసిన పద్ధతిలో వ్రాసి ఇచ్చారు. మేం అప్పుడే ముద్రించాల్సి వుండె. కానీ అవన్నీ చదివిన తర్వాత బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, దళిత క్రైస్తవుల ఇంట పెరగడానికి, ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి, ట్యుటోరియల్ పెట్టడానికి కారణాలను ఆయన ఎదుర్కొన్న ఘర్షణ పడిన సంఘర్షణ క్లుప్తంగా తెలుసుకొని, ఆయన పోరాట ప్రస్థానాన్ని ఒక గ్రంథంలా తీసుకరావాలనుకున్నాం. కానీ అందుకు సంబంధించిన సమాచారం ఎవ్వరూ సమగ్రంగా చెప్పలేకపోయారు. అందుకే ఆలస్యమైంది. ఇంత ఆలస్యమైనందుకు మన్నించాలని బాబు మాస్టార్ ఉద్యమ సహచరులను, కులనిర్మూలనా పోరాట సమితి కార్యకర్తలను, ఉద్యమాభిమానులను కోరుచున్నాం................................