జీవించే కోరిక
అదే రాత్రి అదేపగలు. అదే సంధ్యాకాలం అదే మధ్యాహ్నం. దిక్కులన్నీ తిరుగుతూ నీలాకాశంలో వంగిన బాణాన్ని సృష్టిస్తున్నాయి పక్షులు. అదే బూడిదరంగు ఆవు గుమ్మం దగ్గర నిలబడి ఎప్పుడో ఒక సారి అంబా అని అరుస్తుంది. ఇల్లు, పెరడు, పరిసరాలు అన్నీ ఎప్పటిలాగే కనిపిస్తున్నాయి. కేవలం నేనే మారిపోయాను. నడక, నిశ్వాసాలు, కలలు అన్నీ నెమ్మది నెమ్మదిగా మారిపోతున్నాయి. ఇప్పుడు మించిపోయిందేముంది? నా ఉనికి మారాల్సిఉందని గట్టిగా అనిపిస్తుంది. రాత్రంతా కోరికలతో నిద్రపోవడం కుదరలేదు. కళ్ళు మూసీ మూయనట్టుగా ఉన్నా ఏదో దౌర్భాగ్యబాణం తగిలినట్టు కృత్రిమంగా తయారైన నాకలల పిల్లగుర్రాలు గౌరవంగా దర్భగడ్డిలాంటి ఏదో గ్రాసాన్ని యాచిస్తున్నట్టుగా నాదగ్గరకు వస్తున్నాయి. కాని దురదృష్టవంతురాలిని. నేనేం చేయగలను? నావ మునిగిపోతున్నప్పుడు కాపాడడానికి ఏమాత్రం ప్రయత్నించాను నేను. దైవం పక్షపాతం వహిస్తుంది. అయినా తెగిపోయిన తాడుతో కుండనెవరు కడతారు?
మంచం పైనుండి లేచి అలాగే పడుకుని ఉన్న తపతి ఇలా ఆలోచించీ, ఆలోచించీ విరహాశ్రువులలో మొదటిదాన్ని రాల్చింది. ఇదీ ఆ దిక్కులేనిదాని రోజువారీ జీవితం. రోజంతా ఆఫీసులో ఎక్కువ కాలాన్ని గడిపి, అనేకమైన పనుల్లో మనసును లగ్నంచేసి, దుఃఖాన్ని ఎలాదిగమింగి ఏవిధంగా ఆమె ఇంటికి తిరిగొస్తుందో అలా కాయకల్పానుభవంతో ఉండడం మరొకరివల్ల అవుతుందా?
అమ్మా! తపతీ! నిద్రపోయావా ఏంటి? స్నేహంగా అడుగుతున్న పక్కనే నిలబడ్డ అమ్మ కంఠస్వరాన్ని విన్నది.
అమ్మా! నిద్ర రావడంలేదు. కనురెప్పలు మూసుకున్నా కళ్ళకు నిద్ర రావడంలేదు. కళ్ళపైనే తెల్లారిపోయింది...............