సీమకథాకోకిల సురేంద్ర రోడ్డ
కళారత్న బిక్కి కృష్ణ
సుప్రసిద్ధ కవి, కథారచయిత.
సినిమా రచయిత
83744390536
రాయల సీమలో ఎందిరో కథకులు అనేక సమస్యలపై కథలు రాసారు. మధురాంతకం రాజారాం, పులికంటి కృష్ణారెడ్డి, సింగమనేని నారాయణ, స్వామి, శాంతి నారాయణ లాంటి సీమ కథకులు కరువు, ఫ్యాక్షనిజం, నీటి సమస్య, రైతుల సమస్యలు, సీమ నీటి ప్రాజెక్టులు, రైతుల ఆత్మహత్యలు.. ఇలా సవాలక్ష సమస్యలపై ఎన్నో కథలు రాశారు. వారికోవలోనే ఇప్పటికీ చాలామంది మంచి కథలు రాస్తున్నారు. అలాంటి వారిలో సురేంద్ర రొడ్డ ఒకరు. పులికంటి కృష్ణా రెడ్డి చిత్తూరు జిల్లా మాండలికంలో అద్భుతంగా కథలు రాసారు. ఇప్పుడు సురేంద్ర రొడ్డ అచ్చం కృష్ణారెడ్డి లాగ ప్రజల యాసను మాండలిక భాషను గట్టిగా పట్టుకొని అద్భుత కథలు రాసి 'అడవి మల్లి ' పేరుతో వెలువరిస్తున్నారు.
సురేంద్ర రొడ్డ కవిగా లబ్దప్రతిష్టుడు. అద్భుతమైన కవితాసంపుటాలు (1. నాన్న పచ్చి అబద్దాల కోరు 2. భావతరంగాలు) వెలువరించి సంచలనం సృష్టించారు. మంచి భావుకుడైన ఈ కవి ప్రతి దృశ్యాన్ని కవిత్వంగా శిల్పీకరించడంలో సిద్ధహస్తుడు. కాని కథలు రాస్తే అద్భుతంగా ఉంటాయి. స్వామి, శాంతినారాయణ లాంటి కవులు మొదట కథలు రాసే తర్వాత కథకులుగా స్థిరపడ్డారు. పులికంటి కృష్ణారెడ్డి 'అమ్మి పాటలు' రాసి.. అద్భుత కవి అనిపించుకున్నారు. నండూరి ఎంకి పాటల్లోలేని కవిత్వం పులికంటి 'అమ్మి' పాటల్లో ఉంది.
అలాగే సురేంద్ర రొడ్డ కవిగా పేరుపొంది.. ఇప్పుడు కథకుడుగా మారి.............