కుండలిని యాత్ర
మీరందరూ ఇక్కడకు ఎందుకు వచ్చారో నాకు తెలీదు. బహుశా మీకు కూడా తెలియకపోవచ్చు. మనలో చాలామంది ఏ రకంగా జీవిస్తున్నాము అంటే. ఎందుకు బ్రతుకుతున్నామో, ఎక్కడికి, ఎందుకు వెళ్తున్నామో ఎరుక లేకుండా జీవితాన్ని సాగిస్తున్నాం. మనల్ని మనం "ఎందుకు" అని ప్రశ్నించుకోం. ఇలాంటి ఆధారభూతమైన ప్రశ్నలను అడగకుండానే మనం మొత్తం జీవితాన్ని గడిపేస్తాం.
మూర్ఛ మరియు మేల్కోవడం
అందువలన ఇక్కడకు రావడంలో మీ యొక్క ఉద్దేశ్యం తెలియకుండానే మీరు వచ్చి ఉండటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చేమో కానీ అలా అయ్యే అవకాశం కూడా చాలా తక్కువే.
మనం ఎలాంటి నిద్రావస్థలో, గాఢమైన అచేతనావస్థలో జీవిస్తున్నాము, నడుస్తున్నాము, చూస్తున్నామూ, వింటున్నాము అంటే ఎదుట ఉన్నదాన్ని చూడలేకపోతున్నాం. ఏది చెప్పబడుతుందో అది వినలేకపోతున్నాం. ఉన్నదానితో సంబంధం ఉండట్లేదు. అన్నివైపులా - లోపలా, బయటా మన చుట్టూ ఉన్నదాన్ని అనుభవానికి తెచ్చుకోలేకపోతున్నాం. కాబట్టి మీరు ఒకవేళ ఇక్కడకు తెలియకుండా, ఎరుక లేకుండా వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు.
మనం ఎందుకు బ్రతుకుతున్నామో మనకు తెలీదు. మనం ఏం చేస్తున్నామో. ఎరుక లేదు - అది ఎంతగా అంటే మన శ్వాస గురించే మనకు గుర్తింపు లేదు.
కానీ నాకు బాగా తెలుసు నేనెందుకు ఇక్కడ ఉన్నానో - అదే నేను మీతో పంచుకోవాలకునేది.....................