• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Addamke Margam

Addamke Margam By D Ravi Kumar , Ryan Holiday

₹ 299

అవగాహనతో కూడిన క్రమశిక్షణ

ఆయిల్మాన్గా పని చేయడానికి ముందు జాన్ డి. రాక్ ఫెల్లర్ ఒహియోలోని క్లైమ్లాండ్లో బుక్ కీపర్గా, ఔత్సాహిక పెట్టుబడిదారుగా, స్వల్పకాలం ఫైనాన్షియర్గా పని చేశాడు. కుటుంబాన్ని వదలిపోయిన ఒక నేరస్తుడి కుమారుడిగా రాక్ ఫెల్లర్ 1855లో 16 ఏళ్ల మొదటి ఉద్యోగం చేశాడు. (అదే రోజును 'జాబ్ డే'గా తన జీవిత పర్యంతం సెలబ్రేట్ చేసుకున్నాడు). ఇంతాచేసి రోజుకి యాభై సెంట్లు వస్తే గొప్ప.

అప్పుడే ఉపద్రవం ముంచుకొచ్చింది. ఒహియో కేంద్రంగా మొదలైన జాతీయ ఆర్థిక సంక్షోభం ప్రత్యేకం క్లెన్లాండ్ను ప్రత్యేకంగా దెబ్బకొట్టింది. దేశవ్యాప్తంగా వ్యాపారాలు విఫలమయ్యాయి. ధాన్యం ధరలు పడిపోయాయి. వెస్ట్ వర్డ్ విస్తరణ వెంటనే ఆగిపోయింది. ఫలితంగా అనేక సంవత్సరాలపాటు తీవ్ర మాంద్యం నెలకొంది.

రాక్ఫెల్లర్ భయపడి వుండొచ్చు. అతడు అన్నిటినీ చక్కబరుచుకుంటున్న క్రమంలో చరిత్రలో మార్కెట్లను ముంచెత్తిన అతిపెద్ద మాంద్యం అతడిని తాకింది. అతడు బయటపడి, తండ్రిలాగే పారిపోయి వుండొచ్చు. అతడు ఫైనాన్స్ వ్యాపారాన్ని వదిలిపెట్టి తక్కువ ఇబ్బందులుండే మరో వ్యాపారం ఎంచుకోవచ్చు. రాక్ ఫెల్లర్ యువకుడే అయినప్పటికీ తీవ్రమైన ఒత్తిడిలో కూడా స్థిరంగా వుండగలిగే విశేస గుణం వుంది. అతడు తన చొక్కా కోల్పోయినప్పటికీ తలఎత్తుకునే వున్నాడు. ప్రతి ఒక్కరూ తమవన్నీ కోల్పోయినప్పటికీ అతడు తల ఎత్తుకునే వున్నాడు.

కాబట్టి ఈ ఆర్థిక తిరుగుబాటు గురించి విలపించే బదులు, ముఖ్యమైన సంఘటనలను రాక్ఫెల్లర్ ఆసక్తిగా గమనించాడు. దాదాపు వక్రబుద్ధితో,......................................

  • Title :Addamke Margam
  • Author :D Ravi Kumar , Ryan Holiday
  • Publisher :Manjul Pablication House
  • ISBN :MANIMN5836
  • Binding :Papar Back
  • Published Date :2024
  • Number Of Pages :201
  • Language :Telugu
  • Availability :instock