అద్భుత ఫలితాల కొరకు అతి శక్తివంతమైన
531 పాశుపత మహామంత్రాలు
గణపతి పాశుపతం లేదా
రోగ నివారణ పాశుపతం
మంత్రము: ఓం జూం సః సః జూం ఓం గణపతయే వర వరద ఓం జూం
సః సర్వరోగాన్ హర హర సః జూం ఓం స్వాహా ॥
విధానము: గణపతికి దూర్వాలు వేసిన జలాలతో అభిషేకించి, షోడశోప చారములతో పూజించాలి. ఇరువది ఒక్క పత్రాలతో అష్టోత్తర శతనామ పూజ చెయ్యాలి. కుడుములు నివేదన చెయ్యాలి. ఈ విధంగా ఏ మాసంలోనైనా శుక్ల, కృష్ణ పక్షములలో వచ్చు చవితి తిథులలోగాని, హస్త నక్షత్రం రోజున గాని, బుధవారంతో గూడిన హస్త నక్షత్రం రోజున గాని పై మంత్రమును నమక చమకములతో సంపుటీకరించి అభిషేకాదులు ఆచరించిన రోగ నివారణ తప్పక జరుగుతుంది.
సుబ్రహ్మణ్య పాశుపతం
మంత్రము : ఓం శ్రీం హ్రీం క్లీం సౌః శరవణ భవ వభణ వరశ
సౌః క్లీం హ్రీం శ్రీం ఓం.
విధానము: అష్టగంధము, విభూతితో స్వామికి అభిషేకం చెయ్యాలి. షోడశోపచారములతో స్వామిని పూజించాలి. ఇరువది ఒక్క దీపాలను వెలిగించి, సుగంధ ద్రవ్యాలతో చేసిన లడ్డు నివేదన చెయ్యాలి. ఈ విధంగా చేసి, పై మంత్రాన్ని నమకము, చమకములతో సంపుటీకరించి అభిషేకము........................