అథోజగత్ సహోదరి
వ్యభిచారం అనేది శరీరాల్లోనే కాదు, చూపుల్లోనూ వుంది. తలపుల్లోనూ వుంది".
రామలింగం మాట్లాడే ప్రతిమాటకీ రెండర్థాలుంటాయి. తప్ప జారి వృత్తిలోకి దిగాడు కాని సినిమా కవి అయుంటే బాగా రాణించేవాడు. అతను మాట్లాడే తీరే అదొకరకంగా వుంటుంది. “రావే” అంటే ఎక్కడికి రమ్మంటున్నా, ఎక్కడికో ఎందుకు రమ్మంటున్నా, ఎందుకో రమ్మంటున్నట్టే వుంటుంది.
అతని పని దేశం నలుమూలలా తిరుగుతూ వయసులో వున్న, అసహాయులైన, దిక్కులేని, ఆడపిల్లల్ని వలేసి పట్టుకుని, 'స్వామి సన్నిధి'లో విడిచిపెట్టడం. అందుకతనికి పక్కలాభాలెన్ని వున్నా లేకపోయినా, తిరుపతిలో వున్న ఫలానా లాడ్జిలో ఫలానా మొత్తం మాత్రం ఖచ్చితంగా ముడుతుంది.
"సూళ్ళూరుపేట యిప్పుడేమీ లాభం లేదు. పిప్పళ్ళ బస్తాల్లాగా వుండే వాళ్ళొచ్చి పిప్పొన్నుల ముద్దులు తప్పితే జేబులోనుంచి పదిపైసలు తియ్యటానికి ప్రాణం పోతున్నట్టు లబలబలాడ్తారు. తిరపతంటావా? అక్కడిట్లా కాదు. దేశం నలు మూలల్నుండీ, ఆ మాటకొస్తే ఇతర దేశాల్నుంచి కూడా జనం స్వామి దర్శనార్ధం వస్తారు. వచ్చేవాళ్ళంతా ఎంతెంత దురాల్నుంచి ఎన్నెన్ని కష్టాలు పడి వస్తారో తెలుసుకో".................