₹ 100
తెలుగు సాహిత్యంలో అచ్చం ముస్లింల పై జీవితాల పై ఒక ముస్లిం వెలువరిస్తున్న కథ సంకలనం "ఆధురే " తాజాదనంతో ... సులువైన నడకతో... ఉత్కంఠను కొనసాగిస్తూ... మూస పద్దతిని బద్దలు చేస్తూ.. విభిన్నంగా కనిపించడమే ఈ కథల లక్షణం. ఈ పుస్తకం చదివాక ఈ కథల్లోని ముస్లిం స్త్రీల పాత్రలు మనల్ని వెంటాడతాయి. దావత్ లలో స్త్రీలను ఆఖరి బంతుల్లో కూర్చోబెట్టినట్ట్టే నిర్ణయాలన్నిటిలోను వాళ్లది ఆఖరి బంతే. ఇలాంటివెన్నో దృశ్యాలను కాళ్ల ముందుంచిన రచయిత సునిశిత దృష్టిని మనం గమనించవచ్చు . ఆనాడు తెలుగు సాహిత్యంలో శ్రీ పాద గుబాళింపజేసిన గులాబీ అత్తరుల.. ఈ కథలు ముస్లిం జీవితాల పరిమళాన్ని, పేదరికపు గోసను వ్యాపింపజేస్తున్నాయి. వీటిల్లో వ్యక్తమైన నిర్మలమైన మనసు మరెన్నో విశిష్టమైన కథల్ని వాగ్దానం చేస్తున్నది.
- Title :Adhoore Muslim Stories
- Author :Skybaaba
- Publisher :Navachethana Publishing House
- ISBN :MANIMN1173
- Binding :Paperback
- Published Date :2016
- Number Of Pages :130
- Language :Telugu
- Availability :instock