₹ 200
సాహిత్యం కాలానుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చెందుతూ వుంటుంది. సాహిత్యం ప్రభావం సమాజం పై తప్పకుండా పడుతుంది. సమాజంలోని సమస్యలు సాహిత్యంలో ప్రతిఫలిస్తూనే వుంటాయి. అందులో భాగంగా వచ్చినవే అనేక సమస్యలతో కూడిన స్త్రీ, దళిత, ముస్లింమైనారిటీ వాదాలు.
ఆన్నీ వాదాల్లో వుంటూనే ఏ ప్రత్యేక వాదంగా బాలల సమస్యలు. ప్రస్తుతం సాహిత్యంలో ఎవరికివారు వారి సమస్యల పై పోరాటాలు చేయగలిగారు, చేస్తున్నారు. తమ బాధలను , కష్టాలను, సమస్యలను ఎవరికీ చెప్పుకోలేని ఎలాంటి పోరాటాలు చేయగలిగే శక్తీ లేని అబలలు, అమాయకులు బాలలు.
14 సంవత్సరాలలోపు పిల్లల్ని బాలలుగా ప్రభుత్వం గుర్తించింది. అమాయకత్వం, నిర్భయత్వం మొదలైన లక్షణాలవల్ల బాల్యాన్ని పువ్వులతోనూ, సీతాకోక చిలుకలతోనూ పోలుస్తాము. అయితే ఏవో కొన్ని కారణాలవల్ల కొందరి బాల్యం భరింపశక్యంకాకున్నది. వివిధ సమస్యలు బాలల్ని చుట్టుముట్టేస్తున్నాయి. చిన్నవయసులోనే కొందరు బాలలు పెద్దబాధ్యతలను నెత్తినేసుకొని కుటుంబానికి పెద్దదిక్కు కావల్సి వస్తోంది.
- Title :Adhunika Sahityam Balala Samasyala Chitrana
- Author :Dr P Kumari Niraja
- Publisher :Niraja Publications
- ISBN :MANIMN0839
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :185
- Language :Telugu
- Availability :instock