• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Adiyogi Yoga Sastra Mulam

Adiyogi Yoga Sastra Mulam By Arundathi Subramanyam , Sadguru

₹ 200

ప్రారంభానికి ముందు

అరుంధతి సుబ్రమణ్యం

'ఆదియోగి మీద ఓ పుస్తకం రాయాల్సిన సమయం వచ్చింది' అన్నారు.

సద్గురు ఒకరోజు.

నేను ఆసక్తి కనబరచే ప్రయత్నం చేశాను.

'ఆదియోగి', అన్నారు మళ్లీ, 'శివుడు'.

తలూపాను.

'నీకిది ఆసక్తికరంగా లేదా?' అడిగారాయన ఆటపట్టిస్తున్నట్టు. ప్రశ్నలా కన్నా అదొక ప్రతిపాదనలా ధ్వనించింది.

నా గురువైన ఈ వ్యక్తినుంచి ఏ విషయాన్నైనా దాచిపెట్టడం కష్టమన్నది, ఎన్నో ఏళ్ల శిష్యరికంలో నేను తెలుసుకున్న విషయం. 'నిజమేలెండి, ఈ ఉపఖండంలో శివుడే అత్యంత నిగూఢమైన దేవుడు', అని గడుసుగా వివరించబోయాను.

'శివుడు దేవుడు కాదు', అన్నారు సద్గురు, ఠక్కున.

అవునన్నది కాదనడం ఆయనకొక ఆటన్నది నాకు తెలిసిందే. ఎడ్డెమంటే తెడ్డెమనడం నాకూ సరదానే. కానీ ఇవాళ మాత్రం నేనసలు స్పందించకుండా. ఉండాలని నిశ్చయించుకున్నాను. భావపూరితంగా చెప్పి చూద్దామనుకుని, 'జనన మరణాల నృత్యకేళికి ఆయనొక దివ్యమైన ప్రతీక అన్నమాట నిజమే. పైగా నటరాజుగా దేశ, కాల, గమన, వేగ భావనలకి బ్రహ్మాండమైన సంకేతం', అన్నాను.-

చర్చిస్తున్న అంశానికి అలవాటు పడుతున్న కొద్దీ నేను మరింత బాగా సమాయత్తమవుతున్నాను.........................

  • Title :Adiyogi Yoga Sastra Mulam
  • Author :Arundathi Subramanyam , Sadguru
  • Publisher :Emasco Books pvt.L.td.
  • ISBN :MANIMN6706
  • Binding :Paparback
  • Published Date :2025
  • Number Of Pages :254
  • Language :Telugu
  • Availability :instock