నాకు గర్వకారణం
- పి. వినయకుమార్
నాకు చాలా గర్వంగా ఉంది.
ఒక ఉన్నత లక్ష్యం కోసం జీవితమంతా విరామం లేకుండా శ్రమించిన శివశంకర్గారి కొడుకును కావటం గర్వకారణం కాదా!
కొంతమంది అంటుంటారు - ఆయన ఆలోచనా విధానానికి వారసుడ్ని అవడం కోసమే ఆయన కొడుకుగా నేను పుట్టానని.
నా జీవితంలో అంతకన్నా మరో అదృష్టం ఏమిటంటే ఆయన ఆత్మకథని ఆసాంతం జీర్ణించుకొని, దాన్ని ప్రచురించే అవకాశం నాకు దొరకటం.
మా గీత మరో రకంగా ఉండి ఉంటే - ఆయన ఇప్పటికీ సజీవంగా ఉండి ఉండేవారు. తన కథని ఆయన నోటి ద్వారా వినే అవకాశం మనకి లభించేది.! ఏమైతేనేమి చివరకు ఆ అదృష్టం నాకు దక్కింది.
ఈ ఆత్మకథ నా చేతికి రావటానికి ముందే ఆయన చెప్తుంటే రికార్డు చేయటం, ఆయన రాసుకున్న చిత్తుప్రతిని ఎడిట్ చేయటం, ఆయన కోరిన పాత పత్రాలను, పేపర్ క్లిప్పింగులను సేకరించటం వంటి పనులను మరో ఇద్దరు చేశారు. ఒకరు మా నాన్నగారికి బాగా మనసుకి నచ్చిన వ్యక్తిగత కార్యదర్శి కపూర్ గారు, మరొకరు ఆయన మనమరాలు, నా మేనకోడలు శ్వేతాంబరి.
2017 ఫిబ్రవరి 27 నాడు నాన్నగారు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. అది మా కుటుంబానికి ఇప్పటివరకూ తట్టుకోలేనంత పెద్ద....................