Logili Books

Autobiography and Biography

Adolf Hitler Atma Katha Mein Kampf

By Chandra Shekar

₹558
In Stock Usually ships in 2–4 days
Book Details
Title
Adolf Hitler Atma Katha Mein Kampf
Publisher
Logili Telugu Books, Guntur
ISBN
MANIMN6862
Binding
Paparback
Published Date
2026
Number Of Pages
452
Language
Telugu
Availability
In Stock
About this book

హిట్లర్

1889వ సంవత్సరం, ఏప్రిల్ 20వ తేదీ. ఆస్ట్రియా దేశంలోని బ్రౌనౌ ఆమ్ ఇన్ అనే ఓ చిన్న పట్టణంలో ఓ శిశువు జన్మించాడు. ఆ శిశువే అడాల్ఫ్ హిట్లర్. వాళ్ళ నాన్న అలోయిస్ హిట్లర్, కస్టమ్స్ శాఖలో పనిచేసేవారు. తల్లి క్లారా, అలోయిస్కు మూడో భార్య. ఆరుగురు సంతానంలో హిట్లర్ నాలుగోవాడు. చిన్నతనంలో హిట్లర్ అల్లరి పిల్లాడే అయినా, చదువులో మాత్రం పెద్దగా రాణించలేదు. కానీ, బొమ్మలు వేయడమంటే అతనికి పంచప్రాణాలు. "పెద్దయ్యాక గొప్ప చిత్రకారుడిని అవుతాను, ప్రపంచం మొత్తం నా బొమ్మలు చూసి ఆశ్చర్యపోతుంది” అని ధీమాగా చెప్పేవాడు హిట్లర్.

హిట్లర్ యవ్వనంలోకి అడుగుపెట్టే సమయానికి, వాళ్ల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. హిట్లర్ అమితంగా ప్రేమించే తల్లి క్లారా రొమ్ము క్యాన్సర్తో కన్నుమూసింది. కళ్లముందే తల్లి మరణం హిట్లర్ను తీవ్రంగా కుంగదీసింది. ఆ బాధను దిగమింగుకుంటూ, హిట్లర్ వియన్నా నగరానికి పయనమయ్యాడు. వియన్నాలోని ప్రఖ్యాత ఆర్ట్ స్కూల్లో చేరి, తన కలను నిజం చేసుకోవాలనుకున్నాడు. కానీ, విధి మరోలా తలపోసింది. ఎంత ప్రయత్నించినా, హిట్లర్కు ఆర్ట్ స్కూలో సీటు దక్కలేదు. “నాలో ఉన్న ప్రతిభను వాళ్ళు గుర్తించలేకపోయారు. ఏదో ఒక రోజు వాళ్ళే నా గొప్పదనాన్ని గుర్తిస్తారు” అని నిరాశ, ఆశ కలగలిపిన స్వరంతో అనేవాడు హిట్లర్. పేదరికంలో బ్రతుకుతూ, పోస్ట్ కార్డులు, బొమ్మలు అమ్ముకుంటూ కాలం గడిపాడు.

వియన్నా నగరంలో హిట్లర్కు ఒంటరితనం, నిరాశ తోడయ్యాయి. ఆ సమయంలోనే, అతని మనసులో విద్వేషం అనే విషబీజం నాటుకుంది. జర్మనీ జాతి అన్నిటికన్నా గొప్పదని, ఇతర జాతులు, ముఖ్యంగా యూదులు జర్మనీ పాలిట శాపమని నమ్మడం మొదలుపెట్టాడు.

అక్కడి రాజకీయ నాయకుల మాటలు, వారి జాతి వివక్ష సిద్ధాంతాలు హిట్లర్పై తీవ్ర ప్రభావం చూపాయి. “జర్మనీ జాతి స్వచ్ఛమైన జాతి, ప్రపంచాన్ని పాలించే అర్హత ఒక్క నీతి ఉంది”, “యూదులు మన శత్రువులు, వాళ్ళు మన దేశాన్ని నాశనం.............................

Subscribe to our newsletter
Courier Service
Free Shipping
On orders above ₹500
Secure Payment
100% secure transactions
Easy Returns
30-day return policy
Quality Support
Always online 24/7
Daily Offers
Subscribe for discounts

Talk to us?