అదృశ్య సంకెళ్లు - నరకానికి నకళ్ళు
నరకం ఎలా ఉంటుంది? రకరకాల మత గ్రంథాలలో నరకం, దాని వాతావరణం వేరువేరుగా ఉండొచ్చు. అయితే అన్ని నరకాలు నిలబడేది ఒక సూత్రం మీదే - పాపం చేసిన వాళ్లను క్రూరంగా శిక్షించడం. ఒక ప్రమాదం జరిగిన క్షతగాత్రుడిని నరకమంటే ఏంటని అడిగితే ఈ శరీర బాధలే నరకమని చెబుతాడు. కటిక దరిద్రులని అడిగితే ఈ పేదరికమే నరకం అంటారు. అనాధని అడిగితే ఒంటరితనమే నరకం అంటాడు. నువ్వు చేసిన తప్పులకి కొన్నిసార్లు అనుకోని పరిస్థితిలకే నరకాన్ని చూస్తావు. కానీ ఈ దేశంలో నీకు తెలియకుండా నువ్వు పుట్టే కులం నీకు స్వర్గ నరకాలని నిర్ణయిస్తుంది. నీ స్వర్గ నరకాలని నీ చుట్టూ ఉన్న సంఘం, సమాజం నీకు ఉపక్రమించేలా చేస్తాయి.
ఈ స్వర్గ నరకాలలో హెచ్చుతగ్గులు కూడా ఉండొచ్చు. అలాగే నరకాలలో కిందిస్థాయి ఉన్నా హెచ్చు స్థాయినే నరకం అంటారు. అదే కులవివక్ష. నరకమంటే మాదే అని బ్రాహ్మణ స్త్రీలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినా సరే ఈ దేశంలో కుల వివక్ష లేదనే మాట చెప్పాల్సింది దళితులు, తోటి నిమ్మనజాతి వారే. లేదంటే ఆ మాటకి ప్రామాణికం రాదు.
ఈ నరకం చదువుకున్నా డబ్బులు ఉన్నా పెద్ద ఉద్యోగం ఉన్నా పెద్ద రాజకీయ నాయకులు అయినా నిన్ను వదలదు. కులం నిన్ను వేట కుక్కలా వేటాడుతుంది. వెంటాడుతుంది. పీక్కు తింటుంది. కొందరికి పడగ నీడనిస్తుంది. కొందరికి చల్లని వెన్నెలై కాపు కాస్తుంది.................