• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Adugaduguna Tirugubatu

Adugaduguna Tirugubatu By Geetha Ramaswamy

₹ 499

నేనీ పుస్తకాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది?

నన్ను నేను పరామర్శించుకుంటూ.. పరిసర ప్రపంచంతో నాకున్న సంబంధాలేమిటి, అందులో నా స్థానం ఎక్కడని ప్రశ్నించుకుంటూ చేసిన అన్వేషణ ఫలితమే ఈ పుస్తకం. నేను కేరళ మూలాలున్న ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. అయితే యాభై ఏళ్లకు పైగా నా కార్యక్షేత్రమంతా హైదరాబాద్ నగరమూ, కొండలూ గుట్టలతో నిండిన ఆ చుట్టుపక్కల ప్రాంతాలే. పాశ్చాత్య దేశాల్లో 'బ్రా'లను తగలబెట్టడాన్ని ఓ ర్యాడికల్ చర్యగా పరిగణిస్తుంటే - పధ్నాలుగేళ్ల వయసులో బ్రా ధరించినందుకు మా కుటుంబమే నన్నో నీతిమాలినదానిగా చూసింది. నా యవ్వనపు రోజులన్నీ చిన్న చిన్న తిరుగుబాట్లతో, గణితం మీద వ్యామోహంతో గడిచిపోయాయి. 1970లలో నేను నక్సలైట్ ఉద్యమంవైపు మొగ్గాను, ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లాను. ఇదంతా చూసి, నాకెవరో 'బ్రెయిన్ వాష్' చేశారని అనుకున్నారు నా తల్లిదండ్రులు. నన్ను బలవంతంగా మద్రాసుకు తరలించి, ఆ బ్రెయిన్ వాష్న 'రివర్స్' చేయించటం కోసం నాకు కరెంట్ షాక్ ట్రీట్మెంట్ ఇప్పించారు. దానివల్ల నా జ్ఞాపకశక్తి చెదిరి పోయింది. ఎంతగా అంటే- స్నేహితులు నానా కష్టాలూ పడి నన్ను మద్రాసు నుంచి తప్పించి, హైదరాబాద్కు తీసుకువచ్చిన తర్వాత.. నేను ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తినే గుర్తుపట్టలేకపోయాను. మానసికంగా అంతా అయోమయమైపోయింది. ఎమర్జెన్సీ కాలంలో అరెస్టులను తప్పించుకోడానికి నేనూ, నా భర్త సిరిల్ రెడ్డి ఉత్తర భారతదేశానికి వెళ్లిపోయి, ఘజియాబాద్లో బాల్మీకీల మధ్య జీవించటం ఆరంభించాం. అక్కడ వాళ్లకి ఇంగ్లిష్ నేర్పించటం వంటి రకరకాల పనులు చేశాం. ఆ కాలంలో నాకు తరచూ ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తుండేది. 1980లో మేం హైదరాబాద్కు తిరిగి వచ్చాంగానీ ఇక్కడ మాకోసం ఎదురు చూసే కుటుంబంగానీ, పార్టీ గానీ ఏదీ లేదు. అయినప్పటికీ ఈ నగరమే మా ఇల్లు అయ్యింది. స్నేహితుల సహాయంతో మేం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ (హెచీబీటీ)ని నెలకొల్పాం. వామపక్షవాదులు, అంబేడ్కరిస్టులతో ఎక్కువగా కలసి పనిచేస్తూ, తక్కువ ధరలకే పుస్తకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ప్రచురణ............

  • Title :Adugaduguna Tirugubatu
  • Author :Geetha Ramaswamy
  • Publisher :Hyderabad Books Trust
  • ISBN :MANIMN4947
  • Binding :Papar back
  • Published Date :2023
  • Number Of Pages :455
  • Language :Telugu
  • Availability :instock