1857 తిరుగుబాటు భారతదేశ చరిత్ర క్రమాన్నీ స్వభావాన్ని మార్చివేసింది. బ్రిటిష్ విధానాల వల్ల దెబ్బతిన్న స్వదేశీ పాలకులు, రైతులు, చేతివృత్తులవారు, సిపాయిలు, గిరిజనులు, తమ అసమ్మతినీ, అసంతృప్తిని వ్యక్తం చేశారు. కంపెనీ సైన్యంలోని భారతీయ సిపాయిలు లేదా భారతీయ సైనికులు ముందు నడచిన 1857 తిరుగుబాటు క్రమంలో ఈ జనాభాలోని వివిధ వర్గాలవారు వచ్చి చేరారు.
తిరుగుబాటుకు కారణాలు
ఈ తిరుగుబాటు తలెత్తడానికి అనేక కారణాలు దోహదం చేశాయి. సదుపాయంకోసం వీటిని, రాజకీయ, ఆర్థిక, మత, సామాజిక, సైనిక పరమైన కారణాలుగా చర్చిద్దాం.
రాజకీయ కారణాలు
అత్యంత స్వార్థపూరితమైన, నియమరహితమైన రీతిలో 1757 నుంచి 1856 వరకు భారతదేశంలో తమ రాజకీయ అధికారాన్ని అవిచ్ఛిన్నంగా విస్తరింపజేసుకొనే బ్రిటిష్ విధానం, పీడితులయిన స్వదేశీ జనాభాలోని వివిధ వర్గాల ప్రజల్లో తీవ్రమైన అసమ్మతికీ అసంతృప్తికీ దారితీసింది. స్వదేశీ రాజ్యాలమీద
వెల్లెస్లీ బలవంతంగా రుద్దిన సైన్య సహకార (సహాయక సంధి) విధానాల వల్ల ఎంతోమంది సైనికులు ఉపాధి కోల్పోయారు. అదే విధంగా, అన్యాయంగా స్వదేశీ రాజ్యాలను బ్రిటిష్ సామ్రాజ్యం ఆక్రమించుకోవడానికి వీలుగా డల్హౌసీ అనుసరించిన విధానం ఝాన్సీ, సతారా, సంభల్పూర్, నాగపూర్, జైత్పూర్, బగాత్, ఉదయ్పూర్ స్వదేశీ రాజ్యాల పాలకులు ఆగ్రహోదగ్రులయ్యారు...................